TG Tulam Gold Scheme : తెలంగాణ మహిళలకు పండగలాంటి వార్త.. తులం బంగారం పథకంపై బిగ్ అప్డేట్.. ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే

TG Tulam Gold Scheme : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన తులం బంగారం పథకం అమలుపై కీలక అప్డేట్ వచ్చింది.

Telangana it minister duddilla sridhar babu clarity on tulam gold with kalyana lakshmi scheme will implement soon

  • తెలంగాణ మహిళలకు శుభవార్త
  • కళ్యాణ లక్ష్మి తులం బంగారంపై బిగ్ అప్డేట్
  • అమలుపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ

TG Tulam Gold Scheme : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే.. కళ్యాణ లక్ష్మి పథకంలో ఇచ్చే నగదుతో పాటు.. తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కూడా ఈ పథకంపై ఎలాంటి ప్రకటన లేదు. దీంతో విపక్షాలు, ప్రజలు తులం బంగారం పథకం ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తులం బంగారం పథకంపై బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ప్రకటన వెలువడింది.

తెలంగాణ బడ్జెట్ : కళ్యాణ లక్ష్మి రూ.1,450 కోట్లు 

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు తులం బంగారం పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ప్రతి దాన్ని కచ్చితంగా అమలు చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ముందుగా ముఖ్యమైన హామీలను నెరవేర్చామని.. త్వరలోనే కళ్యాణ లక్ష్మి నగదుతో పాటు తులం బంగారం పథకాన్ని కూడా అమలు చేస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు. ఐదేళ్ల పదవీ కాలం లోపు తమ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పథకాలన్నీ అమలు చేశాకే తిరిగి ప్రజల వద్దకు వెళ్తామని అన్నారు.

Marry Disabled Woman : దివ్యాంగురాలిని పెళ్లి చేసుకుంటే కళ్యాణలక్ష్మితో పాటు అదనపు సాయం

అయితే తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరు గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దీనిపై శ్రీధర్ బాబు స్పందిస్తూ.. పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ 420 హామీలు ఇచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయని.. అయితే తాము అలాంటి హామీలు ఇవ్వలేదని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.