×
Ad

Kavitha: కాంగ్రెస్‌లో చేరికపై కవిత క్లారిటీ.. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు బంపర్ ఆఫర్..!

మేము మంచిగా మా పార్టీని తయారు చేసుకుంటున్నాం. విధి విధానాలు తయారు చేసుకుంటున్నాం. ఎవరి కోసం మేము వెయిట్ చేయడం లేదు.

Kavitha Representative Image (Image Credit To Original Source)

  • కాంగ్రెస్ లూజింగ్ పార్టీ
  • అసలు నేనెందుకు కాంగ్రెస్ లో చేరతా
  • మాది చాలా సీరియస్ పార్టీ
  • మహేశ్ అన్నను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నా

 

Kavitha: కాంగ్రెస్ లో చేరికపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. తనను కాంగ్రెస్ లో చేర్చుకోబోము అని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అంటున్నారని.. అసలు నేను కాంగ్రెస్ లో ఎందుకు చేరతాను అని కవిత ప్రశ్నించారు. మహేశ్ గౌడ్ కు కవిత బంపర్ ఆఫర్ ఇచ్చారు. మహేశ్ గౌడ్ ను జాగృతిలోకి ఆహ్వానించారు. జాగృతిలో చేరితే మహేశ్ గౌడ్ కు మంచి పోస్ట్ ఇస్తాను అని చెప్పారు. తనను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని మహేశ్ గౌడ్ పై మండిపడ్డారు కవిత. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం అని కవిత జోస్యం చెప్పారు. ఎన్నికల్లో జాగృతిదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.

”మహేశ్ కుమార్ గౌడ్ చిట్ చాట్ లో చెప్పారని నేను విన్నాను. నేను కాంగ్రెస్ లోకి వస్తానంటే ఆయన వద్దన్నారంట. మహేశ్ అన్నకి చెబుతున్నా. అన్నా కాంగ్రెస్ లో ఏమీ లేదు. అది లూజింగ్ పార్టీ, ఓడిపోయే పార్టీ. నెక్ట్స్ టైమ్ తెలంగాణలో కాంగ్రెస్ రాదు. నెక్ట్స్ టైమ్ తెలంగాణలో మా జాగృతి పార్టీనే గెలుస్తుంది. మహేశ్ కుమార్ గౌడ్ నే నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా. మీకున్న అనుభవానికి మీకు మంచి పోస్ట్ ఇస్తా. నేషనల్ కన్వీనర్ పోస్ట్ ఇస్తాం. మీరే జాగృతిలోకి రండి. మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తాం. దేవుడి దయతో తిరుగులేని రాజకీయ శక్తిగా తెలంగాణలో ఆవిర్భవిస్తాం. మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు.

నేను కాంగ్రెస్ లోకి వస్తానని మీకు చెప్పడం, మీరు వద్దనడం, ఇవన్నీ మీకు కలలో వచ్చి ఉండొచ్చు. ఏమీ అనుకోవద్దు. ఎవరికైనా చూపించుకోండి. ఇటువంటి మాటలతో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. మేము మంచిగా మా పార్టీని తయారు చేసుకుంటున్నాం. విధి విధానాలు తయారు చేసుకుంటున్నాం. ఎవరి కోసం మేము వెయిట్ చేయడం లేదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ముందడుగు వేస్తాం. సమయం సందర్భాన్ని బట్టి ముందుకెళ్తాం. ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా” అని కవిత అన్నారు.

Also Read: ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ కోసం రేవంత్ సర్కారు చేసిన ప్రయత్నాల ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం: శ్రీధర్‌ బాబు