Telangana Junior Doctors : జుడాల సమ్మె విరమణ

జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. ప్రజా ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లండించారు. సీఎం నుంచి సానుకూల స్పందన రావడంతో ఆందోళన విరమించడం జరిగిందన్నారు. అన్ని డిమాండ్లు నెరవేర్చకపోయినా..సీఎం సానుకూల స్పందనతో సమ్మెను విరమించడం జరిగిందన్నారు.

Junior Doctors Withdraw Strike : జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. ప్రజా ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లండించారు. సీఎం నుంచి సానుకూల స్పందన రావడంతో ఆందోళన విరమించడం జరిగిందన్నారు. అన్ని డిమాండ్లు నెరవేర్చకపోయినా..సీఎం సానుకూల స్పందనతో సమ్మెను విరమించడం జరిగిందన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు, సీనియర్ వైద్యులు సమ్మె చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ సమ్మె కొనసాగింది.

అత్యవసర సేవలతో పాటు..తాత్కాలిక సేవలు, ఓపీ సేవలను నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డితో 2021, మే 26వ తేదీ బుధవారం జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ చర్చలు జరిపింది. సమ్మెను కొనసాగిస్తున్నామని వారు ప్రకటించారు. ఆందోళనలు కొనసాగించారు.  2021, మే 27వ తేదీ గురువారం మధ్యాహ్నం హెల్త్ సెక్రటరీ రిజ్వీ వీఆర్కే భవన్ లో జూడాలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం అయ్యాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని జూడాలు వెల్లడించారు.

జూడాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది.. జూడాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం కొన్ని డిమాండ్లకు ఒప్పుకుందని.. మిగిలిన వాటిపై చర్చించి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటామన్నారు జూడాలు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియాపై టెక్నికల్‌ సమస్య వస్తుందని చెప్పారని.. ఈ అంశంపై చర్చించి తమ నిర్ణయం చెప్పాలని ప్రభుత్వం చెప్పిందన్నారు.. అన్ని విషయాలపై సాయంత్రం తమ నిర్ణయాలను వెల్లడిస్తామన్నారు జూడాలు. సమ్మె విరమణపై సాయంత్రం జూడాలు ప్రకటన చేశారు.

 

 

Read More : Tip Refund: బిల్డప్ కోసం టిప్ ఇచ్చాడు.. గర్ల్ ఫ్రెండ్ లేనప్పుడు అడిగి తీసేసుకున్నాడు

ట్రెండింగ్ వార్తలు