Maoists warn of sand mafia: ఇసుక మాఫియాకు మావోయిస్టులు లేఖ..కాంట్రాక్టర్లకు శిక్ష తప్పదంటూ హెచ్చరిక

ఇసుక మాఫియాకు మావోయిస్టులు లేఖరాశారు. కాంట్రాక్టర్ల తీరు మార్చుకోకపోతే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని.. శిక్ష తప్పదని హెచ్చరిస్తు లేఖ రాశారు.

letter in the name of the maoists warning sand mafia : తెలంగాణలో ఇసుక మాఫియాకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఇసుక మాఫికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన మావోయిస్టులు వారికి హెచ్చరికలు జారీ చేస్తులో ఓ లేఖ విడుదల చేశారు. జేఎండబ్ల్యూ కార్యదర్శి వెంకటేష్ పేరుతో విడుదల చేసిన లేఖలో ఆదివాసి ఇసుక సొసైటీ రీచ్ లలో మాఫియా చొరబడి దోచుకుంటోందని ఆరోపించారు. కొందరు కాంట్రాక్టర్లు ఆదివాసీలను విభజించి పాలించాలని చూస్తున్నారని, యువతను తాగుడుకు బానిసలుగా మార్చి గ్రూపులుగా చీల్చి పబ్బం గడుపుకుంటున్నారని..ఇటువంటి దుర్మార్గపు పనులు మానుకోకపోతే ఫలితం తీవ్రంగా ఉంటుందని లేఖలో హెచ్చరించారు.

Read more : Covid-19 : అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేతలు..లొంగిపోతే ప్రాణాలు కాపాడతామంటున్న పోలీసులు

తెలంగాణలోని ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక మాఫియా కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ మావోయిస్టులు ఆదివారం ఒక లేఖను విడుదల చేశారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. లేకపోతే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ లేఖలో హెచ్చరికలను పట్టించుకోకుండా ఇష్టానురీతిగా వ్యవహరిస్తే సహించేది లేదని..ప్రజాకోర్టులో ఇసుకమాఫియాతో పాటు దుర్మార్గాలకు పాల్పడేవారిని ప్రజాకోర్టులో శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. కాంట్రాక్టర్లు ప్రభాకర్ చౌదరి, పిల్లుట్ల శ్రీనులు ఇప్పటికైనా మారాలని లేకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more : Maoist Tested Positive: కరోనాతో 10 మంది మావోయిస్టులు మృతి

 

 

ట్రెండింగ్ వార్తలు