TS Covid Update : తెలంగాణలో ఈరోజు కొత్తగా 2,447 కోవిడ్ కేసులు

తెలంగాణలో ఈరోజు కొత్తగా 2,447 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,11,656 కి చేరింది.

  • Updated on- January 17, 2022 / 08:24 PM IST

TS Covid update

TS Covid Update  : తెలంగాణలో ఈరోజు కొత్తగా 2,447 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,11,656 కి చేరింది. గత 24 గంటల్లో కోవిడ్ తదితర సంబంధిత వ్యాధులతో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ వల్లమరణించిన వారి సంఖ్య4,060కి చేరింది.

కోవిడ్ నుంచి ఈ రోజు 2,295 మంది కోలుకున్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,85,399 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,197 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ ఎంసీ పరిధిలో ఇవాళ 1112 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 96.31 శాతంగా ఉంది.

Also Read : Vaccination In India : 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా..ఎప్పటి నుంచి అంటే