Vaccination In India : 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా..ఎప్పటి నుంచి అంటే

12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ఫిబ్రవరి చివరి నాటికి గానీ, మార్చ్‌ తొలి వారంలో గానీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి...

Vaccination In India : 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా..ఎప్పటి నుంచి అంటే

Covid

Updated On : January 17, 2022 / 7:48 PM IST

12 To 14 Years Vaccination In India : 12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ఫిబ్రవరి చివరి నాటికి గానీ, మార్చ్‌ తొలి వారంలో గానీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 15-18 ఏళ్ల మధ్య వారికి టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 3 కోట్ల 31 లక్షల మంది టీనేజర్లకు టీకా వేశారు. 13 రోజుల్లో 45 శాతం మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. జనవరి చివరి నాటికి మొత్తం 7 కోట్ల 40 లక్షల మందికి మొదటి డోస్‌.. ఫిబ్రవరి చివరి నాటికి రెండు డోస్‌ల వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామంటున్నాఅధికారులు. ఈ డ్రైవ్‌ ముగియగానే 12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది.

Read More : Mekapati Goutham Reddy : ఏపీలో రూ.18వేల కోట్లతో పోర్టులు, ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణం

కరోనా కారణంగా పిల్లల చదువులు ఆగమాగం అయిపోయాయి. అటు స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు తెరవలేకపోవడంతో విద్యార్థులు ఇంటికే పరిమతమయ్యారు. కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించిన..చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఇలా రెండు సంవత్సరాలు గందరగోళ పరిస్థితుల మధ్యే గడిచిపోయాయి. కనీసం ఈ సంవత్సరం అయినా కరోనా తగ్గుముఖం పడుతుందని అనుకున్నారు. తక్కువ సంఖ్యలో కేసులు నమోదయినా..మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒక్కసారిగా దూసుకొచ్చింది.

Read More : Akhanda Amma Song : ఎమోషనల్‌గా ఆకట్టుకుంటున్న ‘అఖండ’ ‘అమ్మ’ సాంగ్..

రెండు వైరస్ లు ప్రజలపై విరుచుకపడుతున్నాయి. దీంతో ఈ సంవత్సరం ప్రారంభంలోనే అధికంగా పాజిటివ్ కేసులు రికార్డువుతున్నాయి. ఈ క్రమంలో..పలు రాష్ట్రాలు మళ్ల ఆంక్షల బాటపడుతున్నాయి. విద్యారంగ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు రాష్ట్రాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సెలవులను పొడింగించింది. పిల్లలకు వ్యాక్సినేషన్‌ పూర్తయితే స్కూళ్లకు ధైర్యంగా పంపే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.