Mekapati Goutham Reddy : ఏపీలో రూ.18వేల కోట్లతో పోర్టులు, ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణం

ఏపీలో రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. వీటి నిర్మాణంపై కేంద్ర పీఎం గ‌తిశ‌క్తి అధికారుల‌తో చ‌ర్చించారు.

Mekapati Goutham Reddy : ఏపీలో రూ.18వేల కోట్లతో పోర్టులు, ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణం

Mekapati Goutham Reddy

Mekapati Goutham Reddy : “పీఎం గతిశక్తి”పై నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీలో రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. వీటి నిర్మాణంపై కేంద్ర పీఎం గ‌తిశ‌క్తి అధికారుల‌తో మంత్రి చ‌ర్చించారు.

మారిటైమ్ ఆధారిత సంపదను పెంచడంలో, పోర్టులకు సంబంధించిన వసతులను పెంపొందించడంలో మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ ముందుందని మంత్రి తెలిపారు. ఎయిర్ పోర్టులకు అనుసంధానంగా రోడ్లు, రైళ్ల మార్గాలను నిర్మించడం సహా పోర్టుల ద్వారా సముద్ర వాణిజ్య అనుసంధానంలో ఏపీకి తిరుగులేదన్నారు. మల్టీ మోడల్ కార్గో హబ్ లు, సహజ వాయువుల పంపిణీ విస్తరణ ద్వారా పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిలో ఏపీ దూసుకెళ్లడం ఖాయమన్నారు మంత్రి మేకపాటి.

Obesity : స్థూలకాయానికి ఆహారంలో మార్పులతో పాటు..

రాష్ట్రవ్యాప్తంగా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంద‌ని, ఇందుకోసం పంచ‌సూత్రాలు అమ‌లు చేస్తున్నామ‌ని మంత్రి మేక‌పాటి తెలిపారు. సీఎం జగన్ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలను మంత్రి వివ‌రించారు. పోర్టులను అత్యాధునికంగా తీర్చిదద్దడం, జలవాయు మార్గాలను మరింత అభివృద్ధి చేయడం వంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని వెల్లడించారు. ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ సహకారంతో టెలికం రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామ‌ని వివరించారు.

సకల రవాణా మార్గాలూ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని మంత్రి తెలిపారు. ప్రతి రవాణా మార్గం మరో మార్గంతో పూర్తి అనుసంధానం ఏపీ ప్రత్యేకత చాటుకుందన్నారు. అందుకే చవకగా సరుకు రవాణా ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంద‌న్నారు. పీఎం గతిశక్తిపై కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ప్రతి రాష్ట్రం నుంచి ఒక నోడల్ ఆఫీసర్ నియ‌మించింద‌ని తెలిపారు.

Indian Army: ఇండియన్ ఆర్మీ “యూనిఫామ్” గురించి 5 ఆసక్తికర అంశాలు

రూ.18వేల కోట్లతో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను.. 9 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోందని మంత్రి మేకపాటి చెప్పారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, బెంగళూరు-హైదరాబాద్ వంటి 3 పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తూ రాష్ట్రంలోని ప్రతి జిల్లానూ కలుపుతూ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగవకాశాలతో పాటు రహదారులు, నీటి వసతులు, విద్యుత్ సదుపాయాలను కల్పించే లక్ష్యంతో ఏపీ ముందుకెళుతోందని మంత్రి వివరించారు. గ్రామ‌, వార్డు స్థాయిలో సచివాలయాలు నిర్మించి, ప్ర‌జ‌ల ఇంటి వ‌ద్దకే ప్ర‌భుత్వ సేవ‌లు చేరువేస్తున్నామ‌ని.. ఇది సీఎం జ‌గ‌న్ ముందు చూపునకు నిద‌ర్శ‌న‌మ‌ని మంత్రి అన్నారు.