Mahabubnagar : మాజీ MLA ఎర్ర శేఖర్ కి కోర్టులో ఊరట..సోదరుడు జగన్మోహన్ హత్య కేసు కొట్టివేత

మాజీ ఎమ్మెల్యేకు కోర్టులో ఊరట లభించింది. సోదరుడు హత్య కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఎర్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ ను ఎర్రశేఖర్ రివాల్వర్ తో కాల్చి చంపారని అభియోగంలో అతనిని నిర్ధోషిగా కోర్టు భావించి కేసును కొట్టివేసింది.

Mahabubnagar : మాజీ ఎమ్మెల్యేకు కోర్టులో ఊరట లభించింది. సోదరుడు హత్య కేసును ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం (మే 13,2022) కొట్టివేసింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ ను ఎర్రశేఖర్ రివాల్వర్ తో కాల్చి చంపారని అభియోగంలో అతనిని నిర్ధోషిగా కోర్టు భావించి కేసును కొట్టివేసింది. సోదరుడ్ని ఎర్ర శేఖరే హత్య చేశారని సరైన ఆధారాలు పోలీసులు సమర్పించలేదని వ్యాఖ్యానించిన కోర్టు కేసును కొట్టివేసింది.

కాగా..ఎర్ర శేఖర్ సోదరుడు జగన్మోహన్ 2013 జూలై 18న హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఎర్రశేఖర్ ఏ 1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఎర్ర శేఖర్ ను కోర్టు నిర్ధోషిగా ప్రకటించి కేసు కొట్టివేసింది.ఉమ్మడి మహబూబ్ నగర జిల్లా ధన్వాడ మండల పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ అతని సోదరుడు జగన్మోహన్ లు చింతకుంట సర్పంచ్ పదవిని తమ భార్యలు పోటీ చేయించాలని భావించారు. ఈ విషయమై ఇద్దరి మధ్య రాజీ కుదరలేదు.ఈక్రమంలో ఎర్ర శేఖర్ భార్య భవాని, జగన్మోహన్ భార్య ఆశ్విత కూడా సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయం గురించి సోదరుల మధ్య విబేధాలు వచ్చాయి.

దీని గురించి మాట్లాడటానికి సోదరుడిని కారులో తీసుకు వచ్చే క్రమంలో మాటా మాటా పెరిగి ఎర్ర శేఖర్ జగన్మోహన్ పై తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపిపట్టుగా అప్పటి ఎస్పీ ప్రకటించారు. ఈ కేసులో ఎర్ర శేఖర్ 2013 ఆగష్టు 27న ఎస్పీ ఎదుట లొంగిపోయాడు.ఈ కేసు అప్పటినుంచి విచారణ కొనసాగి ఎట్టకేలకు ఎర్ర శేఖర్ నిర్ధోషిగా భావించిన కోర్టు కేసును కొట్టివేసింది.

 

ట్రెండింగ్ వార్తలు