×
Ad

Minister KTR Comments : బీజేపీ పేరు మార్చుకోవాలంటూ.. మంత్రి కేటీఆర్‌ సెటైర్లు

మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్‌ కమిటీ భేటీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ వేదికగా ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌కు ముందే బీజేపీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కంటే ముందగానే సోదాలు చేసేవారి పేరు చెబుతున్నారంటూ విమర్శించారు.

  • Published On : October 2, 2022 / 03:07 PM IST

Minister KTR comments

Minister KTR Comments : మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్‌ కమిటీ భేటీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ వేదికగా ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌కు ముందే బీజేపీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కంటే ముందగానే సోదాలు చేసేవారి పేరు చెబుతున్నారంటూ విమర్శించారు.

ఎన్‌ఐఏ కంటే ముందే బ్యాన్‌ విధిస్తున్నారని, ఐటీ అధికారుల కంటే వేగంగా నగదు వివరాలు చెబుతున్నారని, సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లు చెబుతున్నారని పేర్కొన్నారు. భారతీయ జనా ఈసీ-సీబీఐ-ఎన్‌ఐఏ-ఈడీ..పీగా పేరు మార్చుకోవాలంటూ సెటైర్లు వేశారు.

Ktr slams NDA government: మిషన్ భగీరథకు జాతీయ అవార్డు.. కేంద్రంపై వ్యంగ్యంగా స్పందించిన కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ 15లోపు షెడ్యూల్‌ వస్తుందని, ఐదెంచెల వ్యూహంతో విజయం సాధించాలని బీజేపీ స్టీరింగ్‌ కమిటీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలనుద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన వార్తను కేటీఆర్‌ ట్యాగ్‌ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.