×
Ad

Muncipal Elections Results 2026 : నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. మున్సిపాలిటీ ఫలితాల్లో క్లీన్‌స్వీప్

Muncipal Elections Results 2026 : నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు పురపాలికల్లో (మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల) ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

Telangana Muncipal Elections Results 2026

  • నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా
  • ఆరు మున్సిపాలిటీల్లో అధికార పార్టీ విజయం
  • గట్టి పోటీ ఇవ్వలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ

Muncipal Elections Results 2026 : తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సత్తాచాటిన కాంగ్రెస్.. మున్సిపాలిటీల్లోనూ అదే తీరున విజయదుందుభి మోగించింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.

Als0 Read : Telangana Municipal Elections Results : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మున్సిపాలిటీలు ఇవే..

నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు పురపాలికల్లో (మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల) ఎన్నికలు జరిగాయి. ఆరు మున్సిపాలిటీల్లో 649 మంది అభ్యర్థులు పోటీ చేశారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు. అయితే, ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఆరు మున్సిపాలిటీల్లో అధికార పార్టీ హవా స్పష్టం కనిపించింది.

నల్గొండ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.
చండూరు మున్సిపాలిటీలో.. మొత్తం 10 వార్డుల్లో ఆరు వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా.. మూడు స్థానాల్లో బీఆర్ఎస్, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.
చిట్యాల మున్సిపాలిటీలో.. మొత్తం 12 వార్డులు ఉండగా తొమ్మిది వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రెండు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, ఒక వార్డులో ఇతరులు విజయం సాధించారు.
దేవరకొండ మున్సిపాలిటీలో.. మొత్తం 20 వార్డులకుగాను పది వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఏడు వార్డుల్లో బీఆర్ఎస్, ఒక వార్డులో బీజేపీ, రెండు వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించారు.
హాలియా మున్సిపాలిటీలో.. 12 వార్డులకుగాను 11వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీలో.. మొత్తం 48వార్డులు ఉండగా 31 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా.. 14వార్డుల్లో బీఆర్ఎస్, ఒక వార్డులో బీజేపీ, రెండు వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించారు.
నందికొండ మున్సిపాలిటీలో .. మొత్తం 12 వార్డులు ఉండగా. 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా.. ఒక వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.