×
Ad

7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 12,993 మంది అభ్యర్థులు.. మున్సిపోల్స్ పై ఫుల్ డిటెయిల్స్

ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆ రోజున కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేస్తారు.

  • 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్‌
  • 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్

Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్స్ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 11న సాయంత్రం 5 వరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాలు బంద్ ​కానున్నాయి. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆ రోజున కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేస్తారు.

Also Read: Harish Rao: ఆ కేసులో రేవంత్‌ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: హరీశ్ రావు

ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని పార్టీల కీలక నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. సమయం ముగియడంతో ఇక పోలింగ్ ముగిసే వరకు సభలు, ర్యాలీలు వంటివి నిర్వహించరాదని అధికారులు తెలిపారు.

ఈ నెల 11న ఉదయం 7 నుంచి ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరుగుతుంది. 2,996 వార్డుల్లో 12,993 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 52 లక్షల మందిపైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. మహిళా ఓటర్లు 26 లక్షలు, పురుష ఓటర్లు 25 లక్షల మంది ఉన్నారు.

మరిన్ని అంశాలు

  • 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్
  • బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్
  • 16,301 బ్యాలెట్ బాక్సులు సిద్ధం
  • పోలింగ్, కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
  • 25,000 మంది పోలీసులను బందోబస్తు
  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,900
  • అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,400
  • సీసీటీవీ మానిటరింగ్‌తో ప్రత్యేక నిఘా
  • స్ట్రాంగ్ రూమ్‌లలో 24 గంటల భద్రతా ఏర్పాట్లు