Harish Rao: ఆ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: హరీశ్ రావు
పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని మెదక్ చర్చి ఏసుప్రభువు మీద కూడా ఒట్టేసి మాట తప్పారని హరీశ్ రావు అన్నారు.
Harish Rao, Revanth Reddy
- ఓటుకు నోటు కేసులో తప్పించుకోలేరు
- ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేయించారు
- రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే అగ్ని ప్రమాదం
Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో హరీశ్ రావు మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని చెప్పారు.
ఈ కారణంగానే నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేయించారని హరీశ్ రావు ఆరోపించారు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేశారని తెలిపారు. ఆ ప్రమాదం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగిందని అన్నారు.
Also Read: తెలంగాణను రక్షించాలంటే ప్రజలు ఈ పని చేయండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నారని హరీశ్ రావు చెప్పారు. అయినప్పటికీ ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు శిక్ష పడక తప్పదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసింది గుండు సున్నా అని విమర్శించారు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పారని, అందుకే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని తెలిపారు.
పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని మెదక్ చర్చి ఏసుప్రభువు మీద కూడా ఒట్టేసి మాట తప్పారని హరీశ్ రావు అన్నారు. రుణమాఫీ మాట తప్పి మోసం చేశారని చెప్పారు. రైతు బంధు ఇవ్వట్లేదని, ఎరువుల కరవును తెచ్చారని అన్నారు.
రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. ఎల్లప్పుడూ కేసీఆర్‌ను తిడుతూ రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నారని అన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా రేవంత్ రెడ్డి బుద్ధి, భాష మాత్రం మారలేదని చెప్పారు. బొగ్గును పాలతో కడిగితే తెలుపు రాదని ఎద్దేవా చేశారు.
