Covishield Vaccine Dose : కొవిషీల్డ్ టీకా రెండో డోసు తేదీని 2 వారాలు పొడిగించే అవకాశం!

రాష్ట్రంలో కోవిషీల్డ్ టీకా రెండో డోసు తేదీని రెండు వారాలు పొడిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కోవిషీల్డ్ రెండవ డోసును మొదటి మోతాదు నుంచి 14 నుండి 16 వారాల మధ్య ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Covishield Vaccine Dose : రాష్ట్రంలో కోవిషీల్డ్ టీకా రెండో డోసు తేదీని రెండు వారాలు పొడిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కోవిషీల్డ్ రెండవ డోసును మొదటి మోతాదు నుంచి 14 నుండి 16 వారాల మధ్య ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి 8-12 వారాల వ్యవధిలో కోవిషీల్డ్ రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కోవిషీల్డ్ మధ్య వ్యవధిని పొడిగించడం ద్వారా యాంటీబాడీలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో ప్రభుత్వం నిర్వహించే 100 కోవిడ్ టీకా కేంద్రాల్లో మొదటి మోతాదుకు 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారికి వేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

18ఏళ్లు పైబడిన వారికి మొదటి మోతాదును ఇచ్చేందుకు 204 ప్రభుత్వ కోవిడ్ టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీకాలు వేసే టీకాల కేంద్రాలలో లబ్ధిదారులు ముందుగానే కోవిన్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి మోతాదు 18ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల లబ్ధిదారులకు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇవ్వనున్నారు. ఈ టీకా డ్రైవ్ walk-in modeలో నిర్వహించనున్నారు. దీనికి CoWIN రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

ఈ వ్యాక్సిన్ ప్రక్రియ జూలై 3 వరకు అమలులో ఉంటుంది. జూన్ 30నాటికి డేటా ప్రకారం.. తెలంగాణ వ్యాక్సిన్ మొదటి మోతాదును 1,89,403 మంది తీసుకున్నారు. 30,434 మందికి పూర్తిగా టీకాలు అందాయి. అదనంగా, 18-44 వయస్సు గల 1,43,141 మంది లబ్ధిదారులు 45 అంతకంటే ఎక్కువ వయస్సు గల 45,910 మందికి మొదటి మోతాదుతో టీకాలు అందించారు. 424 ఆరోగ్య సంరక్షణ కార్మికులు, 492 ఫ్రంట్ లైన్ వారియర్స్, 18-44 ఏళ్ల వయస్సు గల 5,453 మంది, 45 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 24,065 మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందింది.

ట్రెండింగ్ వార్తలు