Smart Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధం.. సర్కార్ కీలక నిర్ణయం.. పంపిణీ ఎప్పుడంటే?

పాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో, నాణ్యమైన, భద్రతా ప్రమాణాలు కలిగిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను(Smart Ration Card) అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.

telangana pvc smart ration card distribution details and features

  • పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు
  • క్యూఆర్ కోడ్‌తో పారదర్శక సేవలు
  • త్వరలోనే లబ్ధిదారులకు ఉచిత పంపిణీ

Smart Ration Card: తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను (PDS) మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. పదేళ్లుగా వాడుకలో ఉన్న పాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో, నాణ్యమైన, భద్రతా ప్రమాణాలు కలిగిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను(Smart Ration Card) అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటీఎం కార్డు రూపంలో ఉండే ఈ కార్డులు ఇప్పటికే జిల్లాలకు చేరుకోగా, కాగితపు కార్డులు చిరిగిపోవడం, పాడవ్వడం వంటి ఇబ్బందులకు ఇది శాశ్వత పరిష్కారం కానుంది.

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరికలు.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

క్యూఆర్ కోడ్ & అధునాతన సాంకేతికత:

ఈ నూతన స్మార్ట్ కార్డు ముందు భాగంలో యజమాని ఫొటో, కార్డు నంబర్ ఉండగా.. వెనుక వైపు ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్ ముద్రించారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల సమాచారం, ఆధార్ అనుసంధాన వివరాలు క్షణాల్లో తెలుస్తాయి. వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్ సాంకేతికతతో అనుసంధానించడం వల్ల రేషన్ అక్రమాలు, దళారుల జోక్యానికి చెక్ పడనుంది. అంతేకాకుండా, ‘వన్ నేషన్–వన్ రేషన్’ విధానంలో లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా సరుకులు పొందే సౌలభ్యం కలుగుతుంది.

త్వరలోనే పంపిణీకి శ్రీకారం:

ఇప్పటికే ఉన్న లబ్ధిదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా ఈ కార్డులను ముద్రించి పౌర సరఫరాల శాఖ సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి అధికారిక తేదీలు, తుది మార్గదర్శకాలు విడుదలైన వెంటనే డీలర్లు, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త డిజిటల్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరిగి, అర్హులైన పేదలకు వేగవంతమైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.