Telangana Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. రైతులకు కీలక సూచనలు

Telangana Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వారంరోజులపాటు వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. రాబోయే ఏడు రోజులు పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు దంచికొడతాయని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Telangana Rain Alert

  • తెలంగాణకు రెయిన్ అలర్ట్ 
  • రాబోయే ఏడు రోజులపాటు ఈ జిల్లాల్లో వర్షాలు
  • తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ

Telangana Rain Alert : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. రాబోయే ఏడు రోజులు పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు దంచికొడతాయని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Also Read : MT Krishna Babu: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక ప్రకటన.. ఆ వార్తలు నమ్మకండి

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వారంరోజుల పాటు వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఆకాశం సాధారణంగా మబ్బుపట్టి ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ వారం రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం కురిసే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ వర్షాల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మహానగరంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంటుందని తెలిపింది.

మరోవైపు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టిసారించాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, ఈ అంశంపై గురువారం మంత్రులు ఉత్తమ్, తుమ్మల, శ్రీధర్ బాబులు పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయ కార్యాచరణపై సమీక్షించారు. వాతావరణ శాఖ విడుదల చేస్తున్న వర్షపాతం అంచనాలు, హెచ్చరికలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని రైతులు సాగు నిర్ణయాలు తీసుకోవాలని, ఆమేరకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని అన్నారు.