Telangana Farmers : అన్నదాతలకు శుభవార్త.. వర్షాలపై వాతావరణ శాఖ బిగ్ అప్డేట్.. ఆ వారంరోజులు వానలేవానలు..

Telangana Farmers : వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ చివరి రెండు వారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Telangana Farmers

Telangana Farmers : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్లో విస్తారంగా వర్షాలు కురవాల్సిన సమయంలో అడపాదడపా జల్లులు మాత్రమే పడుతుండటంతో అన్నదాతలు సాగుచేసిన పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పలు ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ రైతులు శుభవార్త చెప్పింది.

Also Read : TGLPRB Recruitment 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాలకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఇప్పటివరకు సరియైన వర్షాలు కురవక పోవడంతో తెలంగాణ రాష్ట్రంలో 18 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. వరంగల్, జనగామ, హనుమకొండ, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, మెదక్, ములుగు తదితర జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో వరి, పత్తి తదితర పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో సాగు పనులు కూడా మందకొడిగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.

సెప్టెంబర్‌ 11, 12 తేదీల తర్వాత రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిస్తే ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే, మరో వారం రోజుల పాటు వర్షాలు లేకపోతే ఇప్పటికే వేసిన పంటల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం రైతుల చూపంతా ఆకాశంవైపే ఉంది. వర్షాలు కురిస్తే పంటలకు ప్రాణం పోసినట్లవుతుందని, లేకుంటే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌లోనైనా విస్తారంగా వర్షాలు కురిసి పంటలను కాపాడాలని రైతులు కోరుకుంటున్నారు.