Telangana Covid Update Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే
తెలంగాణలో నేటివరకు 7లక్షల 92వేల 898 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7లక్షల 88వేల 415 మంది కోలుకున్నారు.
- Naveen
- Published On : May 23, 2022 / 11:42 PM IST
Telangana Covid Report
Telangana Covid Update Report : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12,017 కరోనా పరీక్షలు నిర్వహించగా..కొత్తగా 27 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 17 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 4, హనుమకొండ జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 1, జగిత్యాల జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1 కేసు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 52 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇంకా 372 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111. ఇక తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 92వేల 898 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7లక్షల 88వేల 415 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది.
అటు దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. ఆదివారం 2.94 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 022 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 2వేల 099 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికిపైగా కరోనా బారినపడగా.. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు 14వేల 832 (0.03 శాతం)కు దిగొచ్చాయి. గడిచిన 24 గంటల్లో మరో 46 మంది కరోనాతో మరణించారు. నేటివరకు దేశంలో 5లక్షల 24వేల 459 మంది మహమ్మారికి బలయ్యారు.
Monkeypox : ఇజ్రాయెల్‌లో మొదటి మంకీపాక్స్ కేసు.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త..!
ఇది ఇలా ఉంటే.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ‘బీఏ.4, బీఏ.5లను భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) తెలిపింది. ప్రస్తుతం ఈ వేరియంట్లు గుర్తించిన వ్యక్తుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని వెల్లడించింది. అయితే తాజా పరిణామంపై ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. మరోపక్క దేశవ్యాప్తంగా నిన్న 8.81 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 192 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
మరోవైపు కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చి.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతున్న బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా.. త్వరలోనే 200 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోనుంది.
North Korea: నార్త్ కొరియాకు వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమన్న అమెరికా.. కిమ్ ఏమన్నాడంటే..
కాగా, ప్రతి లబ్ధిదారునికి వ్యాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా వచ్చే రెండు నెలలు (జూన్, జులై) ‘హర్ ఘర్ దస్తక్ 2.0’ పేరుతో ఇంటింటికీ వెళ్లి టీకా పంపిణీ చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకు స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమాలు, స్కూళ్లు, కాలేజీలు, ఖైదీలు, ఇటుక బట్టీల వంటి ప్రాంతాల్లో పనిచేసేవారు, విద్యకు దూరమైన చిన్నారులకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది. ముఖ్యంగా 12 నుంచి 14ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ తక్కువగా ఉండడం, మరోవైపు ఆ వయసువారికి కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నందున వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.23.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/lFdcRrzKUt— IPRDepartment (@IPRTelangana) May 23, 2022
