డిసెంబర్ నెలాఖరులోగా స్కూళ్ల ప్రారంభం..

Telangana Schools: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో స్కూల్స్ బెల్స్ మోగనున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఇన్ని నెలలుగా మూతపడ్డ స్కూల్స్ ను రీ ఓపెన్ చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ మేరకు తెలంగాణాలో స్కూళ్ల ప్రారంభమై విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నెలాఖరులోగా స్కూళ్లు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. సీఎస్కేకు వైద్య శాఖ నివేదికలు అందినట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ ఓపెన్ చేయడానికి సీఎం కేసీఆర్ ఆమోదం పొందాల్సి ఉంది.