TS TET 2022 : మార్చి 26 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ..జూన్ 6 నుంచి హాల్ టికెట్లు..
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. మార్చి 26వ తేదీ నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.
- nagamani
- Published On : March 25, 2022 / 05:21 PM IST
Ts Tet 2022
TS TET 2022 : తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త తెలిపింది ప్రభుత్వం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కన్నా ముందు తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) నిర్వహించనుంది. దీని కోసం మార్చి 26వ తేదీ నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 12వ తేదీ వరకు స్వీకరించనున్నారు.
పేపర్ 1, పేపర్ 2కు కలిసి దరఖాస్తు ఫీజును రూ. 300గా నిర్ణయించారు. ఒక పేపర్‌కు దరఖాస్తు చేసుకున్న ఇదే ఫీజు వర్తించనుంది. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేటప్పుడు అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, స్టేట్, మొబైల్ నంబర్ తప్పనిసరి. ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరి తేదీ ఏప్రిల్ 11. పేమెంట్ అయిన తర్వాత జర్నల్ నంబర్ వస్తోంది. ఈ నంబర్‌తో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఈడీ, డీఈడీ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చక్కటి అవకాశం..
బీఈడీ, డీఈడీ చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. 2017 టెట్ సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు. హెల్ప్ డెస్క్ సేవలు మార్చి 26 నుంచి జూన్ 12వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించగలరు..
జూన్ 6 నుంచి హాల్ టికెట్లు..
జూన్ 12న టెట్ నిర్వహించి, 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. జూన్ 6 నుంచి టెట్ హాల్ టికెట్స్‌ను సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. tstet.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో టెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు.
TS TET 2022 Notification: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
దరఖాస్తు ప్రారంభం- 2022 మార్చి 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఏప్రిల్ 12
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2022 మార్చి 26 నుంచి ఏప్రిల్ 11
