×
Ad

రైతుల కష్టాలు తీరనున్నాయ్‌.. రూ.295 కోట్లతో 2.91 లక్షల టన్నుల స్టోరేజీతో వీటి నిర్మాణం..

వీటిలో 12 గోడౌన్లను ప్రభుత్వ నిధులతో, మరో 14 గోదాములను నాబార్డు నిధులతో నిర్మిస్తుంది.

Warehouses: తెలంగాణలో మూడేళ్లలో ధాన్యం ఉత్పత్తి మూడు రెట్లు పెరిగినప్పటికీ వాటిని నిల్వ చేసేందుకు అవసరమైన మేరకు గోదాములు లేవు. దీంతో కొత్తగా 26 గోదాములను నిర్మించేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

వీటిలో 12 గోడౌన్లను ప్రభుత్వ నిధులతో, మరో 14 గోదాములను నాబార్డు నిధులతో నిర్మిస్తుంది. వీటి కోసం రూ.295.68 కోట్లు ఖర్చుచేస్తుంది. 2.91 లక్షల టన్నుల స్టోరేజీతో గోదాముల నిర్మాణం జరగనుంది. (Warehouses)

వేర్ హౌజింగ్ శాఖ ఆధ్వర్యంలో 12 గోదాములను, 1.51 లక్షల టన్నుల స్టోరేజీ సామర్థ్యంతో నిర్మిస్తారు. నాబార్డు సహకారంతో 14 గోదాములను రూ.140 కోట్ల రుణాలతో 1.40 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉండేలా గోడౌన్ల నిర్మాణం చేపట్టారు.

Also Read: బడికి డుమ్మాలు కొడుతున్న టీచర్లు.. ఇకపై అలా చేశారో..

పర్యావరణ అనుకూల పంథాలో వీటి నిర్మాణం ఉంటుంది. అందులోని పంటలకు ఎలుకలు, చీడపీడల బెడద లేకుండా చేసేందుకు గాలి వెలుతురు ఉండేలా స్టోరేజ్ వృథాను నివారించేలా నిర్మిస్తారు.

కాగా, 2024-25 ఏడాది తెలంగాణలో 190 లక్షల టన్నుల ధాన్యంతో పాటు 30 లక్షల టన్నుల మక్కల దిగుబడి వచ్చింది. అలాగే, 28 లక్షల టన్నుల పత్తితో పాటు 20 లక్షల టన్నుల ఇతర పంటల దిగుబడి వచ్చింది. వాటిని నిల్వచేసుకోవడానికి గోదాములు సరిపోవడం లేదు.

రైతులు ప్రతి ఏడాది పంటలను నిల్వచేసుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గోదాములు అవసరాల మేరకు లేకపోవడంతో పంట తేమ పెరగడం, తడిసిపోవడం, ఎలుకలు, పురుగులు పడుతున్నాయి.

ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో తెలంగాణ వ్యాప్తంగా 24.59 లక్షల టన్నుల సామర్థ్యమున్న 253 గిడ్డంగులు ఉన్నాయి. అయితే, అవి సంప్రదాయ నమూనాలో ఉండడంతో, వాటి నిర్వహణలో ఇబ్బందులు వస్తున్నాయి.