Telangana Heatwave Alert : ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. రాబోయే 3 రోజులు మరింత పెరగనున్న ఎండలు.. ఆ టైంలో బయటకు వెళ్లారో.. ఇక అంతే
Telangana Heatwave Alert : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు.
- Dharani Pilli
- Updated on- April 15, 2026 / 04:33 PM IST
telangana weather today heatwave alert high temperatures for next three days in few districts
- తెలంగాణ ప్రజలకు కీలక అలర్ట్
- రాబోయే 3 రోజులు మరింత పెరగనున్న ఉండలు
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Telangana Heatwave Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఎండ ఇంత తీవ్రంగా ఉంటే.. ఇక మే నెల వేడిని తలుచుకుని జనాలు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో అయితే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణ ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేశారు. రాబోయే మూడు రోజులు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. మధ్యాహ్నం 12-3 గంటల మధ్య అసలు బయటకు రావద్దని సూచిస్తున్నారు.
రానున్న మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేలా ప్రతి హాస్పిటళ్లలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల వల్ల హీట్‌వేవ్, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటళ్లలో బెడ్లు, IV ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సిద్ధం చేశారు. గ్రామ స్థాయిలో ANM, ASHA, అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా ORS పంపిణీ చేస్తున్నారు.
రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41°C నుంచి 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు ఉంటాయన్నారు.
జాగ్రత్తలు:
-
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లకూడదని సూచిస్తున్న డాక్టర్లు.
-
తగినంత నీరు, ORS, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి.
-
తేలికపాటి దుస్తులు ధరించాలి, తలకు కవర్ వాడాలి.
-
మసాలా, ఆయిల్ ఫుడ్ తగ్గించాలి.
వడదెబ్బ లక్షణాలు:
-
శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడం.
-
తల తిరగడం, వాంతులు, మూర్ఛ.
-
గుండె వేగంగా కొట్టుకోవడం.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు బాధితులను తరలించాలని ఆరోగ్యశాఖ సూచించింది.
