CM Revanth Reddy : భద్రాద్రి రామయ్య మీద ఆనా.. కాస్కో కేసీఆర్.. 2029లో 117 సీట్లు గెలుస్తాం.. రేవంత్ సంచలన కామెంట్స్
CM Revanth Reddy : 2029 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీదే అధికారమంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆ ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
CM Revanth Reddy
- భద్రాచలం రాముడి సాక్షిగా రేవంత్ ప్రతిజ్ఞ..
- 2029 టార్గెట్‌పై కాంగ్రెస్ భారీ స్కెచ్
- 117 సీట్లు గెలుస్తాం.. అధికారం మళ్లీ మనదే
- ‘రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఎన్నికల వేడి మొదలైనట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
ఖమ్మం జిల్లా వేదికగా ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహంపై ఆసక్తిని పెంచుతోంది. చింతకాని మండలం (CM Revanth Reddy) జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’కు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వేదిక నుంచే ఆక్ష్న వానాకాలం సీజన్ రైతు భరోసా తుది విడత నిధులు రూ.1009 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ఎదుగుదలలో ఖమ్మం జిల్లా గుండెకాయలాగా నిలిచిందన్నారు. 2029లో 117 సీట్లు గెలుస్తాం.. అధికారం మళ్లీ మనదే అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశంగా మారాయి.
ఖమ్మం నుంచే 2029 శంఖారావం? :
ఖమ్మం జిల్లా అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి కీలక నేతలు భారీగా చేరారు. అదే భారీ ప్రజా స్పందన విజయానికి పునాది వేశాయని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
అదే ఖమ్మం వేదికగా ఇప్పుడు 2029 ఎన్నికల్లో తమదే అధికారమంటూ ప్రకటించడం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఉందనే చర్చ సాగుతోంది. రైతు ఆశీర్వాద సభలో రైతు భరోసా నిధుల విడుదల చేసిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచారానికి ముందస్తు సంకేతాలుగా చెప్పవచ్చు.
182 సీట్లు.. కాంగ్రెస్ టార్గెట్ 117 :
నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని, త్వరలోనే అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం 182 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండోసారి కూడా ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. అయితే, 117 సీట్ల లక్ష్యం కాంగ్రెస్‌కు ఎంతవరకు సాధ్యమవుతుంది? ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు, ప్రతిపక్షాల బలం, ప్రజాభిప్రాయం ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్కు చెక్ పెట్టే వ్యూహమా? :
రేవంత్ రెడ్డి ప్రసంగంలో బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కారు పార్టీ తిరిగి బలపడకుండా చూస్తామన్నారు. 2023 ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అంటే.. 2029లో భారీ మెజారిటీ సాధించాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
అసలు పరీక్ష ఇప్పుడే మొదలు.. :
2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అధికార పార్టీ ఇప్పటినుంచే రాజకీయ రణరంగానికి సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. రైతు సంక్షేమం, అభివృద్ధి, ప్రజాపాలన అంశాలతో ముందుకెళ్తూ మళ్లీ ప్రజల తీర్పు కోరాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
సీఎం వ్యాఖ్యలు ఇప్పడు పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని రేకిత్తిస్తోంది. భద్రాచలం రాముడి సాక్షిగా సీఎం రేవంత్ చేసిన ఈ రాజకీయ ప్రతిజ్ఞ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
