Telangana weather update: కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న వేళ ఉన్నట్టుండి వర్షసూచన చేశారు వాతావరణ విశ్లేషకులు. ఫిబ్రవరి 22-24 మధ్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అసాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఫిబ్రవరి 22న మధ్య, తూర్పు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పారు.
హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాచలం సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడే అవకాశం ఉందని అన్నారు.
Also Read: హైదరాబాద్‌లో రెస్టారెంట్ లో తీగలాగితే.. దేశంలో రూ.70,000 కోట్ల స్కాం.. బయటపడిందిలా..
మరోవైపు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో 33 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 17-19 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.
అయితే ఆదిలాబాద్, మహబూబాబాద్ ప్రాంతాల్లో వరుసగా 34.3, 34.4 డిగ్రీలుగా నమోదయ్యాయి, ఖమ్మంలో 33.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఉదయం లేదా రాత్రి వేళల్లో పొగమంచు ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా సుమారు 31, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు దక్షిణ-తూర్పు దిశ నుంచి 4-6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.