TS BJP Candidates 1st List Release: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. గజ్వేల్ నుంచి కేసీఆర్ పై ఈటల పోటీ

బీజేపీ తొలి జాబితాలో ఎనిమిది మంది ఎస్సీలకు, ఆరుగురు ఎస్టీలకు టికెట్ దక్కింది. 12 మంది మహిళలకు తొలి జాబితాలో బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది.

Telangana BJP

Telangana BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం ఆదివారం విడుదల చేసింది. మొత్తం 52 మందికి తొలి జాబితాలో టికెట్ కేటాయించింది. బీజేపీ తొలి జాబితాలో ఎనిమిది మంది ఎస్సీలు, ఆరుగురు ఎస్టీలు , 12మంది మహిళలకు అవకాశం దక్కింది. వెలమ సామాజికవర్గానికి మెదటి లిస్ట్ లో ఐదు స్థానాలు, గౌడ సామాజికవర్గానికి మూడు, యాదవులకు మూడు సీట్లు, ముదిరాజ్ లకు రెండు సీట్లు కేటాయించింది. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులను ఈసారి బీజేపీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. మరోవైపు ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తుండగా. తాజాగా సస్పెన్షన్ నుంచి విముక్తి పొందిన రాజాసింగ్ పేరుకూడా తొలిజాబితాలో ఉంది. అయితే ఈటల రాజేందర్ ముందు నుంచి చెబుతున్నట్లుగా రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ నుంచే కాకుండా సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి, ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్  అసెంబ్లీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు.

Read Also : MLA Raja Singh: రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ అధిష్టానం.. గోషామహల్ నుంచే మరోసారి బరిలోకి?

నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల జాబితా.. 

కరీంనగర్ – బండి సంజయ్
సిర్పూర్ – పాల్వాయి హరీశ్ బాబు
బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి
ఖానాపూర్ (ఎస్టీ) – రమేశ్ రాథోడ్
అదిలాబాద్ – పాయల్ శంకర్
బోథ్ (ఎస్టీ) – సోయం బాపూరావు
నిర్మల్ – ఆలేటి మహేశ్వర్ రెడ్డి
ముథోల్ – రామారావు పటేల్
ఆర్మూర్ – పైడి రాకేశ్ రెడ్డి
జుక్కల్ (ఎస్సీ) – టి. అరుణతార
కామారెడ్డి – వెంకటరమణారెడ్డి
నిజామాబాద్ అర్బన్ – సూర్యనారాయణ గుప్తా
బాల్కొండ – ఆలేటి అన్నపూర్ణమ్మ
కోరుట్ల – ధర్మపురి అరవింద్
జగిత్యాల – బోగ శ్రావణి
ధర్మపురం (ఎస్సీ) – ఎస్. కుమార్
రామగుండం – కందుల సంధ్యారాణి
చొప్పదండి (ఎస్సీ) – బొడిగ శోభ
సిరిసిల్ల – రాణి రుద్రమ రెడ్డి
మానకొండూరు (ఎస్సీ) – ఆరెపల్లి మోహన్

హుజురాబాద్ – ఈట రాజేందర్
నర్సాపూర్ – మురళీ యాదవ్
పటాన్ చెరు – నందీశ్వర గౌడ్
దుబ్బాక – రఘునందన్ రావు
గజ్వేల్ – ఈటల రాజేందర్
కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలంగౌడ్
ఇబ్రహింపట్నం – నోముల దయానంద్ గౌడ్
మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్
ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి
కార్వాన్ – అమర్ సింగ్
గోషామహల్ – రాజా సింగ్
చార్మినార్ – మేఘా రాణి
చాంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్
యాకుత్ పురా – వీరేందర్ యాదవ్
బహుదూర్ పురా – నరేశ్ కుమార్
కల్వకుర్తి – తల్లోజు ఆచారి
కొల్లాపూర్ – ఎ. సుధాకర్ రావు
నాగార్జున సాగర్ – కంకణాల నివేదితా రెడ్డి
సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు
భువనగిరి – గూడూరు నారాయణ రెడ్డి
తుంగతుర్తి (ఎస్సీ) – కడియం రామచంద్రయ్య
జనగామ – ఆరుట్ల దశమంత్ రెడ్డి
స్టేషన్ ఘన్ పూర్ (ఎస్సీ) – డాక్టర్ గుండే విజయరామారావు
పాలకుర్తి – లేగ రామ్మోహన్ రెడ్డి
డోర్నకల్ (ఎస్టీ) – భూక్యా సంగీత
మహబూబాబాద్ (ఎస్టీ) – జథోత్ హుస్సేన్ నాయక్
వరంగల్ వెస్ట్ – రావు పద్మ
వరంగల్ ఈస్ట్ – ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వర్దన్నపేట (ఎస్సీ) – కొండేటి శ్రీధర్
భూపాలపల్లి – చందుపట్ల కీర్తిరెడ్డి
ఇల్లెందు (ఎస్టీ) – రవీందర్ నాయక్
భద్రాచలం (ఎస్టీ) – కుంజా ధర్మారావు

ట్రెండింగ్ వార్తలు