MLA Raja Singh: రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ అధిష్టానం.. గోషామహల్ నుంచే మరోసారి బరిలోకి?

బీజేపీ నేత, గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట లభించింది. ఆయనపై బీజేపీ అధిష్టానం గతంలో విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది.

MLA Raja Singh: రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ అధిష్టానం.. గోషామహల్ నుంచే మరోసారి బరిలోకి?

Goshamahal MLA Raja Singh

BJP MLA Raja Singh: బీజేపీ నేత, గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట లభించింది. ఆయనపై బీజేపీ అధిష్టానం గతంలో సస్పెన్షన్ వేటు వేసిన విషయం విధితమే. తాజాగా ఆ సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ సెంట్రల్ డిసిప్లనరీ కమిటీ సెక్రటరీ మెంబర్ ఓం పాఠక్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. గత ఏడాది ఆగస్టు 23న రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తూ బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాజాగా షోకాజ్ నోటీసులకు ఆయన వివరణపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ ఎత్తివేసింది. దీంతో 14 నెలల తరువాత రాజాసింగ్ కు పార్టీ సస్పెన్షన్ నుంచి విముక్తి లభించినట్లయింది.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆయనకు ఊరట లభించినట్లయింది. బీజేపీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ తొలి జాబితాలో రాజాసింగ్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి గోషామహల్ నియోజకవర్గం నుంచే ఆయన్ను బరిలోకి దింపేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి సుమారు 14 నెలల అనంతరం రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు ఎత్తివేయడంతో రాజాసింగ్ అనుచరులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.