Telugu Youth Working For Amazon In America Died
Telugu youth: అమెరికాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బోటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు అమెరికా కాలమానం ప్రకారం 18వ తేదీన ప్రవీణ్ చనిపోగా.. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
గుంటూరు జిల్లా, అత్తలూరు గ్రామానికి చెందిన మాజీనేని నాగ వెంకట శ్రీనివాస్‌రావు, రమాదేవి దంపతుల కుమారుడే ప్రవీణ్ కుమార్. వయస్సు 30ఏళ్లు. హైదరాబాద్ నగరంలోని మియాపూర్ జనప్రియ వెస్ట్ సిటీలో వీరు నివాసం ఉంటున్నారు. ప్రవీణ్‌కుమార్ 2011లో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడే టెక్సెస్ స్టేట్‌లో ఆస్టిన్ నగరంలో అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.