RS Praveen Kumar: కాళేశ్వరం విచారణలో ఈ ప్రశ్నలు అడగకుండా.. అలాంటి ప్రశ్నలు అడిగారు: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఆ శబ్దాలు ఎందుకు వచ్చాయి? అనేది ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

RS Praveen Kumar
RS Praveen Kumar: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న విచారణపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాలు చెప్పారు. 10టీవీ వీకెండ్ విత్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు.
“కాళేశ్వరం విషయంలో పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత ఆ ప్రాజెక్టుపై నాకు ఇంట్రెస్ట్ ఎక్కువయింది.
చాలా మందిని విచారణకు పిలిచారు. ఇక ప్రతి రోజు కూడా పేపర్లలో వార్తలు వస్తున్నాయి. (RS Praveen Kumar)
హరీశ్ రావు వెంబడి నేను కూడా పోయాను. ఓపెన్ ఎంక్వైరీలో నేను కూడా అక్కడ ఉన్నాను.
దాని తర్వాత హరీశ్ రావు మొత్తం ఇస్తున్న డాక్యుమెంట్స్, ఆయన అడుగుతున్న ప్రశ్నలను నేను కూడా నా కళ్లతో చూశాను.
దాని తర్వాత నా పక్కన కూడా కొంతమంది ఇంజనీర్లు కూడా కూర్చొని ఉన్నారు ఆ రోజు.
తర్వాత కేసిఆర్ తో పాటు కూడా పోయే అదృష్టం నాకు కలిగింది. నేను ఆ ఓపెన్ ఎంక్వైరీలో ఆ ఎంక్వైరీలో నేను లేను కానీ వారితో పాటు నేను అక్కడి దాకా పోయాను.
అప్పుడు కూడా నేను కొంతమంది ఇంజనీర్లతో మాట్లాడాను. దాని తర్వాత ప్రధానంగా అసలు ఈ కాళేశ్వరం అనేది మళ్లీ మళ్లీ చర్చలోకి ఎందుకు వస్తుంది?
కాళేశ్వరంలో ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే అందులో ఒక పిల్లర్ కొంగిపోయిందనే వాదనతోనే ఇదంతా ప్రతి రోజు కూడా చర్చ వస్తే కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయిపోయింది. ఈ పరిస్థితుల లోపల అసలు అసలు ఏం జరిగింది అని నేను ఒకసారి పరిశీలించుకుంటూ వెళ్లాను” అని ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) చెప్పారు.
“క్యాబినెట్ పాత్ర ఏంటి? ఇంజనీర్ల పాత్ర ఏంటి? దీని డిజైన్ల లోపాలు ఏమన్నా ఉన్నాయా? అంటూ ప్రశ్నలు అడిగారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ ఎందుకు కూలిపోయింది?
ఆ శబ్దాలు ఎందుకు వచ్చాయి? అనేది కదా అడగాలి? పోలీస్ ఆఫీసర్ ని పిలవాలిగా?” అని ప్రశ్నించారు.