Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ నుంచి స్ట్రాంగ్ ప్లేయర్ ఔట్.. టాప్ 5 లిస్ట్ ఇదే.. ఆ ఇద్దరి మధ్యే పోటీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss 9 Telugu) చివరి దశకు చేరుకుంది. ఇంకా ఒకవారంలో ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఈ వారం హోస్ట్ నాగార్జున కూడా హౌస్ మేట్స్‌కు షాక్ ఇచ్చారు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ నుంచి స్ట్రాంగ్ ప్లేయర్ ఔట్.. టాప్ 5 లిస్ట్ ఇదే.. ఆ ఇద్దరి మధ్యే పోటీ

Bharani Shankar eliminated from Bigg Boss Season 9.

Updated On : December 14, 2025 / 4:30 PM IST

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9 Telugu)చివరి దశకు చేరుకుంది. ఇంకా ఒకవారంలో ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఈ వారం హోస్ట్ నాగార్జున కూడా హౌస్ మేట్స్‌కు షాక్ ఇచ్చారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ముందే ప్రకటించాడు. ఇప్పటికే, శనివారం జరిగిన ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తనూజ, కళ్యాణ్, డెమోన్ పవన్, సంజన, భరణి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వీరిలో, సంజన-భరణి మధ్య టఫ్ ఫైట్ జరిగినట్టు తెలుస్తోంది. చివరకు ఆదివారం నాటి ఎపిసోడ్ లో భరణి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది.

Srikanth Odela: సెట్స్ లో అతనొక ‘మాన్స్టర్’.. శ్రీకాంత్ ఓదెల బర్త్ డే స్పెషల్ వీడియో..

నిజానికి, భరణి ఇదివరకే ఇంటినుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఆ తరువాత పలు కరణాల వల్ల మళ్ళీ లోపలి ఎంట్రీ ఇచ్చాడు భరణి. అంతకుముందు రిలేషన్స్ అంటూ పాకులాడిన భరణి ఆ తరువాత కాస్త మారి ఆటను కొత్తగా మొదలుపెట్టాడు. కానీ, ఆడియన్స్ మాత్రం అతడిని రిజెక్ట్టెడ్ కంటే స్టెంట్ గానే చూశారు. అందుకే, టాప్ 5లో సంజనాని ఛాన్స్ ఇచ్చి భరణిని బయటకు పంపేశారు ఆడియన్స్. ఇక ఇంతకాలం చాలా క్లోజ్ గా ఉన్న ఉన్న భరణి- సుమన్ ఒకేవారం ఎలిమినేట్ కావడం విశేషం. ఇక వీరికి సంబందించిన స్పెషల్ వీడియోను కూడా ప్లే చేశాడు నాగార్జున. ఆ వీడియో చూసి ఇద్దరు ఎమోషనల్ అయ్యారు కూడా.

ఇక టాప్ 5 విషయానికి వస్తే, తనూజ, కళ్యాణ్, డెమోన్ పవన్,సంజన,ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. వీరిలో దాదాపు ఎవరికీ వారు చాలా బలంగా ఉన్నారు. కానీ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే టాప్ 3లో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ ఉండే అవకాశం ఉంది. ఇక విన్నర్ పోటీగా తనూజ, కళ్యాణ్ మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. వోటింగ్ కూడా ఈ ఇద్దరి మధ్యలోనే అన్నట్టుగా ఉంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారు అనేది తెలియాలంటే మరోవారం ఆగాల్సిందే.