Srikanth Odela: సెట్స్ లో అతనొక ‘మాన్స్టర్’.. శ్రీకాంత్ ఓదెల బర్త్ డే స్పెషల్ వీడియో..
శ్రీకాంత్ ఓదెల.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడొక సెన్సేషన్. చేసింది ఒకటే సినిమా కానీ, సెట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో దర్శకుడిగా మారాడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela).
Director Srikanth Odela birthday special video from The Paradise movie
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడొక సెన్సేషన్. చేసింది ఒకటే సినిమా కానీ, సెట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో దర్శకుడిగా మారాడు శ్రీకాంత్ ఓదెల. రా అండ్ రెస్టింగ్ బ్యాక్డ్రాప్ లో లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాని కెరీరి లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా అవార్డ్ కూడా అందుకున్నాడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela).
Dragon: డ్రాగన్ అప్డేట్.. యాక్షన్ మొదలుపెట్టిన ఎన్టీఆర్.. 25 రోజులు అక్కడే
ఇక ఈ సినిమా తరువాత శ్రీకాంత్ ఓదెల మరోసారి నేచురల్ స్టార్ నానితో ది పారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఈరోజు(డిసెంబర్ 14) శశ్రీకాంత్ ఓదెల బర్త్ డే కావడంతో ఆయన సినిమా నుంచి ఆయన వర్కింగ్ కి సంబందించిన స్పెషల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. చూడటానికి చాలా సైలెంట్ గా, క్వైట్ గా ఉంటాడు కానీ, పనిలో మాత్రం ఇతనొక మాన్స్టర్ అని చెప్తూ వచ్చిన ఈ వీడియో ఒక రేంజ్ లో ఉంది. ది పారడైజ్ సినిమా కోసం శ్రీకాంత్ పడుతున్న కష్టం చూస్తుంటే ఈసారి మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనిపిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా తరువాత శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నాడు. హీరో నాని నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. శ్రీకాంత్ కి చిరంజీవి అంటే చాలా ఇష్టం. చాలా పెద్ద ఫ్యాన్ కూడా. తన అభిమాన హీరోని డైరెక్డ్ట్ చేసే అవకాశం రావడం పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. అంతేకాదు, గతంలో ఎన్నడూ లేని విదంగా ఈ సినిమాలో చిరంజీవిని చూపిస్తాడట శ్రీకాంత్ ఓదెల. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది.
