Dragon: డ్రాగన్ అప్డేట్.. యాక్షన్ మొదలుపెట్టిన ఎన్టీఆర్.. 25 రోజులు అక్కడే
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'డ్రాగన్(Dragon)' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
NTR Dragon movie new schedule started in Ramoji Film City
Dragon; మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘డ్రాగన్(Dragon)’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దేవర లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్, సలార్ తరువాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో, ఈ సినిమాకి సంబందించిన చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sasivadane OTT: ఓటీటీలోకి వచ్చిన విలేజ్ లవ్ స్టోరీ ‘శశివదనే’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
డ్రాగన్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ తాజాగా రామోజీ ఫిలిం సిటీలో మొదలయ్యింది. చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. దాదాపు మూడు వారాలపాటు ఈ షెడ్యూల్ జరుగనుంది అని సమాచారం. డ్రాగన్ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇక్కడ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. అది కూడా భారీ ఎత్తున ఉండనుందని టాక్. ఇక ఈ షెడ్యూల్ తో డ్రాగన్ సినిమా టాకీ పార్ట్ దాదాపు కంప్లీట్ అవనుంది అని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ తెలియడంతో న్టర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో మలయాళ కుట్టి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ, ఎన్టీఆర్ ఒకే చోట దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, ఈ షెడ్యూల్ లో రుక్మిణి కూడా పాల్గొంటుంది అని టాక్ నడుస్తోంది. ఇక ఎన్టీఆర్ కూడా గతంలో ఎన్నడూ కనిపించనంతగా కొత్తగా, పవర్ ఫుల్ గా కనిపిస్తాడని టాక్. అందుకోసం రెండు వేరు వేరు లుక్స్ ను ఫిక్స్ చేశాడు ప్రశాంత్ నీల్. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2026 దసరాకి రానుంది డ్రాగన్ మూవీ.
