Sasivadane OTT: ఓటీటీలోకి వచ్చిన విలేజ్ లవ్ స్టోరీ ‘శశివదనే’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవడ్ లో రీసెంట్ గా వచ్చిన విలేజ్ లవ్ స్టోరీ "శశివదనే(Sasivadane OTT)". పలాస సినిమాతో హీరోగా పరిచయమైన రక్షిత్ అట్లూరి, కోమలి జంటగా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన తెరకెక్కించాడు.
Sasivadane movie now streaming on Amazon prime.
Sasivadane OTT: టాలీవడ్ లో రీసెంట్ గా వచ్చిన విలేజ్ లవ్ స్టోరీ “శశివదనే(Sasivadane OTT)”. పలాస సినిమాతో హీరోగా పరిచయమైన రక్షిత్ అట్లూరి, కోమలి జంటగా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా విడుదల తరువాత మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోలేకేపోయింది. కథలో ఎమోషన్ లేకపోవడం, కథనం కూడా రొటీన్ గా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
Aditya Dhar: ఇకనుంచి ఆలాగే చేస్తా.. హృతిక్ కామెంట్స్ పై స్పందించిన దర్శకుడు..
దీంతో, శశివదనే సినిమాను ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 13 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియేటర్స్ లో ఈ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కాబట్టి, ఓటీటీలో మంచి స్పందన వస్తుంది అని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అనేది చూడాలి.
