Aditya Dhar: ఇకనుంచి ఆలాగే చేస్తా.. హృతిక్ కామెంట్స్ పై స్పందించిన దర్శకుడు..
బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్. స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను URI మూవీ దర్శకుడు ఆదిత్య ధర్(Aditya Dhar) తెరకెక్కించాడు. దీంతో, ఈ సినిమాపై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
Director Aditya Dhar shocking reply to Hrithik Roshan.
Aditya Dhar; బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్. స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను URI మూవీ దర్శకుడు ఆదిత్య ధర్(Aditya Dhar) తెరకెక్కించాడు. దీంతో, ఈ సినిమాపై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ ఇచ్చారు. దీంతో, కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది ఈ మూవీ. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కేవలం ఏడూ రోజ్జుల్లోనే రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో, రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Mowgli Review: మోగ్లీ 2025 రివ్యూ: అడవి నేపధ్యంలో సాగే ఎమోషనల్ ప్రేమకథ.. ఎలా ఉందంటే?
అయితే, రీసెంట్ గా దురంధర్ సినిమా చూసిన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. “సినిమా విషయం పక్కన పెడితే.. అందులో చూపించిన రాజకీయ అంశాలను నేను అంగీకరించను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో హృతిక్ పై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. చాలా మంది ఆయన కామెంట్స్ ని వ్యతిరేకిస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించిన హృతిక్ రోషన్ దురంధర్ సినిమా నా హృదయానికి హత్తుకుంది. ఆదిత్య సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు” అంటూ రాసుకొచ్చాడు.
ఇక హృతిక్ చేసిన ఈ పోస్ట్ పై దర్శకుడు ఆదిత్య ధర స్పందించాడు.. ‘సినిమాపై మీరు చూపించిన ప్రేమకు నా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరు వందశాతం కష్టపడ్డారు. మీ ప్రశంసలకు అందరూ అర్హులే. దురంధర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. అది తెరకెక్కించేటప్పుడు ప్రతీఒక్కరి సూచనలను తీసుకొని, వాటిని పరిగణంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం”అంటూ రాసుకొచ్చాడు. దీంతో, దర్శకుడు ఆదిత్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
