Mowgli Review: మోగ్లీ 2025 రివ్యూ: అడవి నేపధ్యంలో సాగే ఎమోషనల్ ప్రేమకథ.. ఎలా ఉందంటే?

రోషన్ కనకాల హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మోగ్లీ 2025(Mowgli Review). ఈ సినిమా నేడు(డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Mowgli Review: మోగ్లీ 2025 రివ్యూ: అడవి నేపధ్యంలో సాగే ఎమోషనల్ ప్రేమకథ.. ఎలా ఉందంటే?

Roshan Kanakala Mowgli 2025 Movie Review

Updated On : December 13, 2025 / 2:40 PM IST

Mowgli Review: ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మోగ్లీ 2025(Mowgli Review). కలర్ ఫోటో లాంటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సాక్షి హీరోయిన్ గా నటించింది. బండి సరోజ్ కుమార్ కీ రోల్ చేసిన ఈ సినిమా నేడు(డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటి? ఎలా ఉంది? రోషన్ హిట్ కొట్టాడా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ముర‌ళీకృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ క‌న‌కాల‌) ఒక అనాథ. చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయి అడివినే అమ్మగా భవిస్తూ అక్కడే ఉంటాడు. అతనికి ఎస్సై కావాల‌నే కోరిక బలంగా ఉంటుంది. అడవి సినిమా షూటింగ్స్ కోసం వచ్చే యూనిట్స్‌కు సాయం చేస్తూ ఉంటాడు. ఆ క్ర‌మంలోనే డాన్స‌ర్ అయిన జాస్మిన్ (సాక్షి మ‌డోల్క‌ర్‌)ని కలుస్తాడు. చూడగానే ప్రేమిస్తాడు. ఆమెకు విన‌లేదు, మాట్లాడ‌లేదు కూడా. అయినా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ, ఈ జంట మధ్యకి అనూహ్యంగా క్రిస్టోఫ‌ర్ నోల‌న్ (బండి స‌రోజ్‌కుమార్‌) అనే ఎస్సై వస్తాడు. జాస్మిన్‌పై క‌న్నేస్తాడు. తన నుంచి కాపాడటానికి మోగ్లీ, జాస్మిన్ అడవిలోకి తీసుకెళ్తాడు. మరి మోగ్లీ జాస్మిన్‌ కాపాడాడా? క్రిస్టోఫ‌ర్ నోల‌న్ వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? చివరకి ఎం జరిగింది అనేది మిగ‌తా క‌థ‌.

విశ్లేషణ:
అడవి నేపధ్యంలో సాగే సున్నితమైన ప్రేమకథ ఇది. అడవిలో పెరిగే కుర్రాడు.. మాటలను రాణి అమ్మాయి.. ఇలా దర్శకుడు కథను మొదలుపెట్టిన తీరు కొంచం కొత్తగానే ఉంది. కానీ, ఆ కథను నడిపించిన తీరు మాత్రం సో సో గానే ఉంది. రాముడు, సీత, ఆంజనేయుడు, రావణుడు, వనవాసం ఇలా కథలో డివోషనల్ ఎలిమెంట్స్ ను కూడా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. సన్నివేశాలు వస్తూ పోతు ఉంటాయి. కానీ, ఎమోషనల్ కనెక్షన్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య ఒక ప్యూర్ ఎమోషన్ ని క్యాప్చర్ చేయాలన్న దర్శకుడి ప్రయత్నం బాగానే ఉంది. కానీ, ఈ ప్యూరిటీ సన్నివేశాలలో కూడా కనిపిస్తే ఇంకా బాగుండేది. ఇక విలన్ ఎంట్రీ తరువాత కథ కాస్త పుంజికున్నట్టుగా అనిపిస్తుంది. కానీ, ఆ తరువాత కథనం మళ్ళీ నెమ్మదిస్తుంది. ఇక ఫైనల్ గా హీరో, విలన్ కి మధ్య పోరాట సన్నివేశాలతో కాకుండా.. కర్మ సిద్దాంతం అని కాన్సెప్ట్ చెప్పి ముగించడం కూడా కథ ఇబ్బందిగా అనిపిస్తుంది.

నటీనటులు:
రోషన్ కనకాల తన నటనతో ఆకట్టుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే మోగ్లీ పాత్రలో ఒదిగిపోయాడు అనే చెప్పాలి. బబుల్ గమ్ సినిమాతో పోల్చితే నటనలో చాలా మెచూరిటీ కనిపించింది. మోగ్లీ పాత్రను తాను ఓన్ చేసుకున్న విధానం చాలా బాగుంది. కథలో ఎమోషన్ లో తన కళ్ళలో చూపిస్తూ బాగా నటించాడు. కానీ, సన్నివేశాలలో బలం లేకపోవడంతో ఆయన నటన కూడా తేలిపోయింది. ఇక హీరోయిన్ సాక్షి కూడా పాత్ర మేరకు చాలా బాగా నటించింది. డైలాగ్స్ లేకపోయినా తన హావభావాలతో, ముఖ కవలికలతో మెప్పించింది. నిజంగా తన ఎఫర్ట్ హైలెట్ అనే చెప్పాలి. ఖచ్చితంగా సాక్షి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక బండి సరోజ్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. తన టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ తో నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సరికొత్త విలనిజాన్ని ప్రదర్శించాడు. ఇక మొగిలినవాడు కూడా పాత్ర మేరకు మెప్పించారు. సుహాస్ చేసిన అతిధి పాత్ర కూడా మెప్పించింది.

సాంకేతిక నిపుణులు:
మోగ్లీ సినిమాకు ప్రధాన బలం అంటే రామ మారుతి కెమెరా ప‌నిత‌నం అనే చెప్పాలి. అడ‌వి అందాన్ని, ఆ నేపధ్యాన్ని ఆవిష్క‌రించిన తీరు ఎక్స లెంట్ గా ఉంది. ఇక కాల‌భైరవ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. రెండు పాట‌లు బాగున్నాయి కానీ, తన నేపధ్య సంగీతంతో సినిమాకు ఎమోషన్ ని యాడ్ చేశాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు తగ్గట్టుగా బాగానే ఖర్చు చేశారు. ఇక, ద‌ర్శ‌కుడు సందీప్‌ రాజ్ ఈ కథను బలమైన భావోద్వేగాలతో చెప్పాలని అనుకున్నాడు. కానీ, ఆయన రచనలో ఆ ఎమోషన్ సీన్ పై కనిపించలేదు అనే చెప్పాలి. దర్శకుడిగా ఇంకాస్త పరిణితి చెందాల్సిన అవసరం ఉందని అనిపించింది.

ఇక ఓవరాల్ గా మోగ్లీ 2025 సినిమా గురించి చెప్పాలంటే.. అడివి నేపధ్యంలో వచ్చిన ఈ ప్రేమకథలో ఎమోషన్ మిస్ అయ్యింది.