IPL 2026 Mini Auction: ఐపీఎల్ మినీ ఆక్షన్ లో కూడా కోట్లు కొల్లగొట్టిన టాప్ 10 ప్లేయర్లు
మినీ ఆక్షన్ లో అత్యంత భారీ మొత్తానికి అమ్ముడైన ప్లేయర్స్...
ఐపీఎల్ మినీ వేలానికి టైమ్ అయింది. డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా వేలం జరగబోతోంది. అయితే, ఇది మినీ వేలమే అయినా సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫ్రాంచైజీలు పాకెట్ కొంచెం బరువుగానే ఉంది. దీంతో కొన్ని సంచలనాలు నమోదయ్యే అవకాలు లేకపోలేదు. అలా గతంలో నమోదైన కొన్ని సంచనాలు తెలుసుకుందాం. మినీ ఆక్షన్ లో అత్యంత భారీ మొత్తానికి అమ్ముడైన ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు అసలు ఫ్రాంచైజీల వద్ద ఎంత పర్సు ఉందో చూద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్ రూ.43.40 కోట్లు
ముంబై ఇండియన్స్ రూ.2.70 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.16.40 కోట్లు
కోల్ కతా నైట్ రైడర్స్ రూ.64.30 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.25.50 కోట్లు
గుజరాత్ టైటాన్స్ రూ.12.90 కోట్లు
రాజస్తాన్ రాయల్స్ రూ.16.05 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ రూ.21.80 కోట్లు
లక్నో సూపర్ జైంట్స్ రూ.22.95 కోట్లు
పంజాబ్ కింగ్స్ రూ.11.50 కోట్లు
గతంలో మినీ ఆక్షన్ లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు
మైఖెల్ స్టార్క్ రూ.24.75 కోట్లు (KKR 2024)
పాట్ కమిన్స్ రూ.20.50 కోట్లు (SRH 2024)
సామ్ కరణ్ రూ.18.50 కోట్లు (PBK 2023)
కామెరాన్ గ్రీన్ రూ.17.50 కోట్లు (MI 2023)
క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్లు (RR 2021)
బెన్ స్టోక్స్ రూ.16.25 కోట్లు (CSK 2023)
యువరాజ్ సింగ్ రూ.16 కోట్లు (DC 2015)
నికోలస్ పూరన్ రూ.16 కోట్లు (LSG 2023)
పాట్ కమిన్స్ రూ.15.50 కోట్లు (KKR 2020)
కేల్ జెమిసన్ రూ.15 కోట్లు (RCB 2021)
