Nara Brahmani: ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ భార్య, హీరో బాలకృష్ణ కూతురు, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి(Nara Brahmani) అరుదైన గౌరవం దక్కింది.
Nara Brahmani received Business Today 'Most Powerful Women in Business' Award.
Nara Brahmani: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ భార్య, హీరో బాలకృష్ణ కూతురు, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి(Nara Brahmani) అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ అందించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకలో బ్రహ్మణి ఈ అవార్డును అందుకున్నారు. దీంతో ఆమె నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యారు. ఈ సందర్బంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. “ఈ గుర్తింపు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. నాయకత్వం అంటే శాశ్వతంగా నిలిచిపోయే సంస్థలను ఏర్పాటు చేయడం, బాధ్యతాయుతమైన విలువను సృష్టించడం. తద్వారా ప్రజలను శక్తివంతం చేయడం. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ‘బిజినెస్ టుడే’ వారికి నా ధన్యవాదాలు. భారతదేశవ్యాప్తంగా ఉన్న మహిళా నేతలను ఇలా ప్రోత్సహించడం అనేది నిజంగా అభినందనీయం” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, ఆమెకు సోషల్ మీడియా వేదికగా చాలా మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ నుంచి స్ట్రాంగ్ ప్లేయర్ ఔట్.. టాప్ 5 లిస్ట్ ఇదే.. ఆ ఇద్దరి మధ్యే పోటీ

Nara Brahmani received Business Today ‘Most Powerful Women in Business’ Award.
