Premante OTT: ఓటీటీలోకి ‘ప్రేమంటే’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
ఈమధ్య కాలంలో ప్రియదర్శి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అలా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రేమంటే(Premante OTT). రోమ్-కోమ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ఆనందీ హీరోయిన్ గా నటించింది.
Priyadarshi 'Premante' movie OTT streaming update.
ఈమధ్య కాలంలో ప్రియదర్శి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అలా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రేమంటే. రోమ్-కోమ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ఆనందీ హీరోయిన్ గా నటించింది. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ తరువాత జీవితం గురించి చెప్పే కథతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. అందుకే, నెలరోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. ప్రేమంటే మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Nara Brahmani: ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి
తాజాగా ప్రేమంటే ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేసింది. డిసెంబర్ 19 నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, థియేటర్స్ లో ఈ సినిమాను ఎక్కువ మంది చూడలేదు కాబట్టి, ఓటీటీలో ప్రేమంటే సినిమాకు మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉంది. మరి, ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అనేది చూడాలి.
