Telangana Panchayat Election Results: రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా
పెరుమాండ్లగూడెంలో మొదటి వార్డు లో రికార్డ్ స్థాయిలో 100% పోలింగ్ నమోదు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రెండో దశకు జరిగిన పోలింగ్ లో సుమారు 85.86 శాతం ఓటింగ్ నమోదైంది. ఒంటిగంట వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. పోలింగ్ పూర్తయిన కేంద్రాల్లో కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ మద్దతుతో బరిలో దిగిన నేతలు ఆధిక్యంలో ఉన్నారు.
సా.5.30 గంటల వరకు గెలుపొందిన సర్పంచ్ ల వివరాలు..
కాంగ్రెస్ మద్దతుదారులు 698
బీఆర్ఎస్ మద్దతుదారులు 245
బీజేపీ మద్దతుదారులు 80
ఇతరులు 219
వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల కౌంటింగ్..
ఉమ్మడి జిల్లాలో 507 గ్రామ పంచాయతీలలో జరిగిన పోలింగ్..
వరంగల్ జిల్లాలో (117 సర్పంచ్ స్థానాలు) కాంగ్రెస్ 08, బీఆర్ఎస్ 01, స్వతంత్రులు 03
హనుమకొండ జిల్లా (73 సర్పంచ్ స్థానాలు) కాంగ్రెస్ 06, బీఆర్ఎస్ 01, బీజేపీ 00, స్వతంత్రులు 01
జనగామ జిల్లా (79 సర్పంచ్ స్థానాలు) కాంగ్రెస్ 05, బీఆర్ఎస్ 02, బీజేపీ 00, స్వతంత్రులు 04
మహబూబాబాద్ జిల్లా (158 స్థానాలు) కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 06, బీజేపీ 00, స్వతంత్రులు 04
జయశంకర్ భూపాలపల్లి జిల్లా (85 సర్పంచ్ స్థానాలు) కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 06, బీజేపీ 00, స్వతంత్రులు 01
ములుగు జిల్లా (52 సర్పంచ్ స్థానాలు) కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 02, బీజేపీ 00, స్వతంత్రులు 03
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినాయకపురం మొదటి వార్డులో సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేయడంతో స్వతంత్ర అభ్యర్థి గెలుపు
హనుమకొండ జిల్లా: ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంలో మొదటి వార్డు లో రికార్డ్ స్థాయిలో 100% పోలింగ్ నమోదు. 117 ఓట్లకు గాను 117 ఓట్లు పోలింగ్ నమోదు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ గ్రామంలో రెండు ఓట్లతో విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థి చంద్రశేఖర్
తెలంగాణలో తొలిదశలో 4236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారిలో 2334 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన 1169 మంది విజయం సాధించారు. బీజేపీ మద్దుతుతో 189 మంది గెలిస్తే 538 మంది ఇతరులు సర్పంచ్ గా విజయ ఢంకా మోగించారు. ఇక రెండో దశలో మొత్తం 4332 సర్పంచ్ స్థానాలు, 29917 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది.

