Prof Kodandaram: జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నారా? కీలక వివరాలు తెలిపిన ప్రొ.కోదండరామ్
"నేను ఈ మధ్య కాలంలోనే టీజీపీఎస్సీ చైర్మన్‌ని కలిశాను. దీనిపై దృష్టి పెట్టాలని చెప్పాం. అదే విధంగా ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి దీనిపైన దృష్టి పెట్టవలసిన విషయం గురించి చెప్పాం" అని అన్నారు.

Kodandaram
Prof Kodandaram: తెలంగాణను అభివృద్ధి చేసుకోవడంలో ఏ విషయం మీదైనా సరే తమ ప్రయత్నం అనేది ఆగలేదని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇవాళ ఆయన 10టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
“ఏ విషయం మీద కూడా మా ప్రయత్నం ఆగలేదు. గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి మేము నిరుద్యోగ సమస్య మీద మూడు విషయాలు చెబుతున్నాం.
ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు జరగాలి. ఓ స్కిల్ యూనివర్సిటీ ఏర్పడ్డది.
ఐటీఐలను కూడా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ గా చేసి, వాటి ద్వారా కూడా వీలైనంత వరకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ప్రయత్నం జరుగుతోంది. నోటిఫికేషన్ల విషయంలో ఒక క్యాలెండర్ విడుదలయింది.
వాస్తవానికి మేము అడిగింది క్యాలెండర్. ఆ క్యాలెండర్ విడుదలైంది. అయితే, ఎస్సీ క్లాసిఫికేషన్ కోసం ఒక చట్టం కావాలి.
చట్టం వచ్చేదాకా ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఆపాలి. దానివల్ల వచ్చిన క్యాలెండర్ అనేది డీలే అయింది.
ఇప్పుడు మనం చేయవలసింది ఏందంటే మళ్లీ ఆ క్యాలెండర్‌ను సాధించుకోవాల్సిన అవసరం ఉంది.
నేను ఈ మధ్య కాలంలోనే టీజీపీఎస్సీ చైర్మన్‌ని కలిశాను. దీనిపై దృష్టి పెట్టాలని చెప్పాం. అదే విధంగా ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి దీనిపైన దృష్టి పెట్టవలసిన విషయం గురించి చెప్పాం.
డిప్యూటీ సీఎంకి ఈ బాధ్యత ఇచ్చి దీనిపైన చర్చలు జరపాలని అన్నారు. డిప్యూటీ సీఎంతో మేము కూర్చొని మాట్లాడవలసిన అవసరం ఉంది.
ఆయనతో ఒక రౌండ్ కలిసి మాట్లాడాం. ఒకసారి విడిగా ఆఫీసర్ ని కూడా పిలుస్తానని, మీరందరూ రండి అని అన్నారు.
ఒక నెల పాటు నేను లేను. అవుట్ ఆఫ్ స్టేషన్ అవ్వటం వల్ల ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోయాయి.
గతంలో ఇట్లాంటి విషయాలు మేము మీడియా ద్వారా చెప్పవలసి వచ్చేది. ప్రభుత్వానికి మేము మద్దతు ఇచ్చాం కాబట్టి అలా చేయలేకపోతున్నాం” అని కోదండరామ్ (Prof Kodandaram) అన్నారు.