Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆధార్‌తో పనిలేదు.. సర్కార్ కీలక మార్పులు

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu)పథకం దరఖాస్తు ప్రక్రియలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

TG Government key decision on Aadhaar card no longer required to apply Indiramma houses

  • ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులలో మార్పులు
  • ఓటర్ ఐడీతో అప్లై అవకాశం
  • ఆధార్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి

Indiramma Indlu: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక, ప్రాసెస్ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి (GHMC) సహా అర్బన్ రీజియన్ పరిధిలోని నిరుపేదలకు పక్కా ఇళ్లు(Indiramma Indlu) అందించే క్రమంలో ఈ మార్పులు చేపట్టింది. ప్రారంభంలో దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డును తప్పనిసరిగా అటాచ్ చేయాలనే నిబంధన ఉండటంతో చాలామంది అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ పోర్టల్‌లో మార్పులు చేసింది.

Rajasthan Theft Case: చోరీకి వెళ్లి.. ఆమ్లెట్స్ వేసుకొని తిన్న దొంగలు.. చివరికి పోలీసులు సైతం షాక్

ఆధార్ అడ్రస్ సమస్యకు పరిష్కారం: ప్రత్యామ్నాయ కార్డులకు గ్రీన్ సిగ్నల్:

ఉపాధి, వ్యాపారం లేదా ఉద్యోగ రీత్యా కొన్నేళ్లుగా నగరంలో స్థిరపడినప్పటికీ, చాలామంది నివాసితులకు ఆధార్ కార్డుపై ఉన్న చిరునామా ఇప్పటికీ వారి సొంత ఊళ్లదే ఉంటోంది. ఆధార్‌లోని అడ్రస్ ఆధారంగా అప్లై చేసుకుంటే ఇక్కడ స్థానికత గుర్తింపు రాక దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఆధార్ కార్డుకు ప్రత్యామ్నాయంగా ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్‌బుక్ లేదా డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒకదానిని గుర్తింపు ప్రూఫ్‌గా అప్‌లోడ్ చేయడానికి ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ప్రత్యేక అవకాశం కల్పించింది.

ఆధార్ సంఖ్య తప్పనిసరి: లబ్ధిదారులు గమనించాల్సిన అంశాలు:

అయితే ఇక్కడ దరఖాస్తుదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఆధార్ కార్డు కాపీని అడ్రస్ ప్రూఫ్‌గా అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ, అప్లికేషన్ ఫామ్‌లో ఆధార్ సంఖ్యను నమోదు చేయడం మాత్రం ఇప్పటికీ తప్పనిసరి. పథకంలో పారదర్శకతను కాపాడటానికి, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఇళ్లు రాకుండా నిరోధించడానికే ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నూతన మార్పుతో నగరంలో నివసిస్తున్న లక్షలాది మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అప్లై చేసుకోవడానికి పెద్ద ఊరట లభించినట్లయింది.