TGSRTC : హైదరాబాద్‌లో కొత్త మినీ బస్సులు.. తెలంగాణ సర్కార్ సూపర్ ప్లాన్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) సరికొత్త రవాణా వ్యూహాన్ని సిద్ధం చేసింది.

Tgrtc to launch 100 new mini feeder buses in hyderabad to beat traffic

  • రోడెక్కనున్న కొత్త మినీ బస్సులు
  • తొలి విడతలో వంద బస్సులు
  • తగ్గనున్న సిటీ ట్రాఫిక్ కష్టాలు

TGSRTC: నగరంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC)సరికొత్త రవాణా వ్యూహాన్ని సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత వేగవంతంగా, సులభంగా మార్చాలనే లక్ష్యంతో ప్రత్యేక ఫీడర్ సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు, కాలనీల నుంచి ప్రధాన మెట్రో స్టేషన్లు, బస్ స్టాండ్లకు కనెక్టివిటీ పెంచడం ద్వారా సిటీ ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత చేరువ చేయాలని ప్రభుత్వం బావిస్తోంది.

ED Raids: వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌ ఇంట్లో ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం!

సెట్విన్ స్థానంలో కొత్త సర్వీసులు, తొలి విడతలో 100 బస్సులు:

ఇందుకోసం పూర్వపు సెట్విన్ బస్సుల తరహాలో నడిచే నూతన మినీ బస్సులను పెద్ద సంఖ్యలో రోడ్డెక్కించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గతంలో చార్మినార్ కేంద్రంగా సేవలందించిన 100 మినీ బస్సులు కాలం చెల్లడంతో వాటిని ఇటీవల స్క్రాప్‌గా తొలగించారు. ఈ క్రమంలో ఉత్పన్నమైన రవాణా ఖాళీని భర్తీ చేసేందుకు మొదటి విడత కింద 100 కొత్త మినీ బస్సులను కొనుగోలు చేసి సేవల్లోకి తీసుకురావడానికి ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రయాణికులకు తీవ్ర ఉపశమనం:

పెద్ద ఆర్టీసీ బస్సులు వెళ్లలేని ఇరుకైన గల్లీలు, కాలనీ రోడ్లలో ఈ మినీ బస్సులు చాలా సులభంగా దూసుకెళ్తాయి. ఇవి అందుబాటులోకి వస్తే శివారు ప్రాంత ప్రజలకు సొంత వాహనాల అవసరం లేకుండానే తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు చేరే వీలు కలుగుతుంది. దీంతో సిటీ పరిధిలో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గి ప్రయాణం మరింత సుఖమయం కానుంది.