Hyderabad RTC: హైదరాబాద్ ప్రయాణీకులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. ఆ టికెట్ల ధరలు తగ్గాయ్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది.

Hyderabad RTC

Hyderabad RTC: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. (Hyderabad RTC)

Also Read: Indian Railways : ఇండియన్ రైల్వే సూపర్ టికెట్ బుకింగ్.. ఇక నుంచి జస్ట్ చిటికెలో టికెట్..!

గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు ట్రావెల్ యాజ్ యూ లైక్ (టీఏవైఎల్) టికెట్ ధరను తగ్గిస్తూ టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

దీంతో నగరవాసులు ఈనెల చివరి వరకు 24గంటల టికెట్‌పై రాయితీతో ప్రయాణం చేయొచ్చు. మెట్రో డీలక్స్ బస్సులతో పాటు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24గంటలపాటు ఈ టికెట్లను కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు.

మార్పులు చేసిన ధరలు ఇవే..
పెద్దలకు ఇంతకుముందు ఉన్న టికెట్ ధర రూ.150 ను సవరించి రూ.130 చేశారు. మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కు ఇంతకుముందు రూ.120 కాగా.. ప్రస్తుతం రూ.110 చేశారు. పిల్లలకు ఇంతకుముందు ఉన్న టికెట్ ధర రూ.100 కాగా.. ప్రస్తుతం రూ. 90 చేశారు.