Dasara Special Buses: ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్.. దసరాకు స్పెషల్ బస్సులు.. డైరెక్ట్ మీ ఇంటివద్దకే

దసరా పండుగ వేళ గ్రేటర్ హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ (Dasara Special Buses)బిగ్ ఆఫర్ ప్రకటించింది.

TGSRTC announces special buses for Bathukamma and Dasara festivals

Dasara Special Buses: దసరా పండుగ వేళ గ్రేటర్ హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు, విద్యార్థులకు టీజీఎస్ ఆర్టీసీ బిగ్ ఆఫర్ ప్రకటించింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నేరుగా వారుండే ప్రాంతాల నుంచే ప్రత్యేక బస్సు సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ ఈడీ శ్రీధర్ వెల్లడించారు. ముఖ్యంగా వివిధ కళాశాలలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల సౌకర్యార్థం వారు నివసించే ప్రాంతాల నుంచే ముందస్తుగా బస్సులు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఏవైనా కాలనీలు, టౌన్‌షిప్‌లు, హాస్టళ్లు లేదా గేటెడ్ కమ్యూనిటీలలో కనీసం 30 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే, ఆర్టీసీనే నేరుగా వారి వద్దకే స్పెషల్ బస్సును పంపిస్తుండటం విశేషం.

Milk Price Hike: పెరిగిన పాల ధరలు.. లీటరుపై రూ. 8 వడ్డింపు.. సర్కార్ కీలక నిర్ణయం

జిల్లాల వారీగా ముందస్తు బుకింగ్స్.. జేబీఎస్ కమ్యూనికేషన్ సెల్ నంబర్ విడుదల:

హైదరాబాద్ నగరం నుంచి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాచలం, నల్గొండ, సూర్యాపేట సహా పలు ప్రధాన జిల్లాలకు వెళ్లేవారు డివిజనల్ డిప్యూటీ రీజనల్ మేనేజర్లను సంప్రదించి బస్సులను(Dasara Special Buses) కేటాయించుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు రద్దీలో బస్ స్టాండ్లకు వచ్చి అల్లాడకుండా ఈ ముందస్తు బుకింగ్ విధానం ఎంతగానో దోహదపడనుంది. బస్సుల కేటాయింపు, సమాచారం మరియు వివరాల కోసం ప్రయాణికులు జూబ్లీ బస్ స్టేషన్ (JBS) జోనల్ కమ్యూనికేషన్ సెల్ 9959226160 నంబరును సంప్రదించాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది.