TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె.. చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచన
ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు.
- Naveen
- Updated on- April 23, 2026 / 11:48 PM IST
TGSRTC Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. కీలక ప్రకటన చేసింది. శుక్రవారం సెక్రటేరియట్ లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో భేటీ కానుంది. ఉదయం 10 గంటలకు ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
ఆర్టీసీ ఉద్యోగులు అధైర్యపడొద్దని టీజీఎస్ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై నాగిరెడ్డి కోరారు. ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారమే యాజమాన్యం ధ్యేయం అని స్పష్టం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు. సమ్మె అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టిందన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమమే యాజమాన్యం ప్రధాన లక్ష్యం అని తేల్చి చెప్పారు.
”శుక్రవారం సెక్రటేరియట్‌లో కీలక భేటీ ఉంటుంది. సీనియర్ అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం ఉంటుంది. బోర్డు పరిధిలోని అంశాలపై కమిటీ చర్చించనుంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చర్చలతో సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉద్యోగులు సంయమనం పాటించాలి. శాంతియుతంగా ఉండాలి. శుక్రవారం చర్చల ఫలితాలు ఉద్యోగులకు మేలు చేస్తాయి” అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం.. నిప్పంటించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
