TGSRTC Strike: ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్ల దోపిడీ..! ఫోన్‎లో క్యూఆర్ కోడ్ చూపించి డబ్బులు వసూలు

కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఒకవైపు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తుంటే మరోవైపు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

  • Published on- April 23, 2026 / 07:59 PM IST

TGSRTC Strike: ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఆర్టీసీ సమ్మెను ప్రైవేట్ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు. చాలా బస్సులు కండక్టర్లు లేకుండానే నడుస్తున్నాయి. దీంతో టికెట్ ఇవ్వకుండానే ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి.. తమ సొంత ఫోన్ లో క్యూఆర్ కోడ్ చూపించి మరీ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. మరికొందరైతే టీ ఖర్చులు అంటూ అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఒకవైపు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తుంటే మరోవైపు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో బస్సులను నడిపే ప్రయత్నం చేస్తోంది ఆర్టీసీ. అయితే, ప్రైవేట్ వ్యక్తులు వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. టీ ఖర్చులకు డబ్బులు కావాలంటూ తమను డిమాండ్ చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్ పే నెంబర్ కు డబ్బులు పంపాలని డ్రైవర్లు అడుగుతున్నారని చెప్పారు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని, డబ్బులు వసూలు చేస్తున్న డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

Also Read: ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న డ్రైవర్, పరిస్థితి విషమం