×
Ad

Thatha Madhu : స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా తాత మధు నామినేష‌న్

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థి తాత మధు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కు నామినేషన్ ఇచ్చారు.

  • Published On : November 22, 2021 / 03:53 PM IST

Tata Madhu

Thatha Madhu files nomination : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా తాత మధు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఖమ్మం కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కు నామినేషన్లు అందించారు. తొలుత టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో అభ్యర్థి తాత మధుకు బీ-ఫామ్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తాత మధు విజయం ఖాయం అన్నారు. రైతు బంధువుగా ఉన్న సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు టీఆర్ఎస్ పార్టీకి మెండుగా ఉన్నాయని తెలిపారు. అందరి శ్రేయస్సు కోసం కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు.

Penna River Bridge : కుంగిన పెన్నా నది బ్రిడ్జి..రాకపోకలు నిలిపివేత

అనంతరం తాత మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సుపరిపాలన వల్లే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి, ప్రజల ఆదరాభిమానాలతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నిక అవుతానన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాములు నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్ రాజ్, కోరం కనకయ్య తదితరులు ఉన్నారు.