Telangana : గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య పెరుగుతున్న దూరం

తాను 119మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించానని, కానీ కొందరు వచ్చారు, మరికొందరు రాలేదన్నారు. తన ఆహ్వానాన్ని గౌరవించనందుకు తానేమీ బాధపడడం లేదని గవర్నర్‌ అన్నారు.

  • Published on- April 2, 2022 / 08:23 AM IST

Kcr Governor

CM KCR‌-Governor Tamilisai : తెలంగాణ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై మధ్య దూరం రోజురోజుకీ మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా హాజరుకాలేదు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సహా తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌ తమిళిసై పరోక్షంగా హాట్‌ కామెంట్స్‌ చేశారు.

తాను 119మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించానని, కానీ కొందరు వచ్చారు, మరికొందరు రాలేదన్నారు. తన ఆహ్వానాన్ని గౌరవించనందుకు తానేమీ బాధపడడం లేదని గవర్నర్‌ అన్నారు. తనను ప్రగతి భవన్‌కి ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్‌ పక్కనపెట్టి హాజరయ్యే దానిని అని చెప్పారు.

Tamilisai Hot Comments : నాకు ఇగో లేదు, ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదు-ఉగాది వేడుకల్లో గవర్నర్ హాట్ కామెంట్స్

యాద్రాద్రికి కూడా తనను పిలవలేదని, కానీ తనకు వెళ్లాలని అనిపించిందన్నారు. తాను వివాదాస్పదం చేసే వ్యక్తిని కానని, వ్యక్తుల మధ్య గ్యాప్‌ సృష్టించే దానిని కానని వెల్లడించారు. కొన్ని అంశాలపై డిఫరెన్సెస్‌ ఉన్నాయని గవర్నర్‌ తెలిపారు. తాను ఎన్నిసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదని, ఇగ్నోర్‌ చేశారని అన్నారు.

ఎవరు పిలుస్తారు అని ఎదురుచూడకుండా సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా వెళ్లినట్లు తమిళసై చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌కు మధ్య గ్యాప్‌ రావడానికి కారణం తెలవదని గవర్నర్‌ అన్నారు. రాజ్‌భవన్ లిమిటేషన్స్ తనకు తెలుసన్న ఆమె.. తనను ఎవరూ నియంత్రించలేరన్నారు. తాను స్ట్రాంగ్ పర్సన్‌ అని.. ఎవరికీ లొంగేది లేదని స్పష్టం చేశారు.