High Court : ఖమ్మం సాయిగణేష్ ఆత్మహత్య కేసు.. మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు

పోలీసుల వేధింపులతోనే సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

High Court notices Puvvada : ఖమ్మం సాయిగణేష్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ఈ కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరో ఆరుగురికి కూడా నోటీసులు పంపింది.

పోలీసుల వేధింపులతోనే సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సాయి గణేష్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని అడ్వకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.

Governor Tamili Sai : రామాయంపేట, ఖమ్మం ఆత్మహత్య ఘటనలపై నివేదిక కోరిన గవర్నర్ తమిళి సై

ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పేర్కొన్నారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇరువైపుల వాదనాలు విన్న హైకోర్టు.. ఏడుగురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది.

ట్రెండింగ్ వార్తలు