×
Ad

Heavy Rains In Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

  • Published On : December 12, 2022 / 08:27 AM IST

heavy rains

Heavy Rains In Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 12 వరకు తేలికపాటి జల్లులు పడతాయని చెప్పింది.

ఈనె 13న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు
గాలులు వీస్తున్నాయని తెలిపింది.

Mandous Cyclone : వాయుగుండంగా మారిన మాండూస్ తుపాను.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు

రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చలి ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదలి తుపానుగా మారిందని వెల్లడించింది. ఈ గాలులకు తుపాను తోడవ్వడంతో చలి తీవ్రత ఎక్కువ అవుతుందని వివరించింది.