Ram Nath Kovind : నేడు శ్రీ రామానుజచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న రాష్ట్రపతి

ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శ్రీరామనగరానికి చేరుకోనున్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Sri Ramanujacharya golden statue : భగవత్ రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగను పురస్కరించుకొని.. ముచ్చింతల్ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వైభవోపేతంగా సాగుతోంది. 20 దివ్యదేశాల్లో ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట నిర్వహిస్తున్నారు…శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. సమతామూర్తి క్షేత్రం జైశ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగుతోంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాక్రతువులో వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో.. శ్రీరామ నగరం పులకించి పోతోంది.

యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో వరుసగా 12వ రోజు ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. నేడు శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులు మీదుగా భద్రవేది మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజచార్యుల బంగారు విగ్రహం ఆవిష్కృతం కానుంది.

Hyderabad : రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శ్రీరామనగరానికి చేరుకోనున్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు రాష్ట్రపతి చేతుల మీదుగా రామానుజాచార్యుల స్వర్ణ విగ్రహం ఆవిష్కరించనున్నారు. ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో రామ్‌నాథ్ కోవింద్ దాదాపు రెండు గంటలపాటు గడపనున్నారు. శ్రీరామానుజాచార్యుల స్వర్ణ విగ్రహ ఆవిష్కరణ అనంతరం సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శించనున్నారు.

అనంతరం రాష్ట్రపతి ఆడిటోరియంలో ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మహా పూర్ణాహుతితో పాటు భగవత్‌ రామానుజుల స్వర్ణమూర్తికి ప్రాణ ప్రతిష్ట, కుంభాబిషేకం నిర్వహించనున్నట్టు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామిజీ తెలిపారు. అలాగే రేపు సాయంత్రం 108 దివ్యదేశాల దేవతలకు శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు