దుబ్బాకలో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టిన కారును పోలిన గుర్తు

  • Publish Date - November 10, 2020 / 05:14 PM IST

roti maker symbol : దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీ పోరులో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ పై 1,470 ఓట్ల మెజారిటీతో బీజేపీ గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. 22 రౌండ్లు వరకూ హోరాహోరీగా సాగిన ఉప ఎన్నిక ఫలితాల్లో 23వ రౌండ్ లో 412 ఓట్లు ఆధిక్యం దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు గెలుపు ఖాయం అయింది.



అయితే దుబ్బాకలో కారును పోలిన గుర్తు టీఆర్ఎస్ ను దెబ్బకొట్టింది. మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో టీఆర్ఎస్, మూడో స్థానంలో కాంగ్రెస్ రాగా నాలుగో స్థానంలో కారును పోలిన రోటీ మేకర్ గుర్తు వచ్చింది. కారును పోలిన గుర్తు కలిగి ఉన్న స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు 3,489 ఓట్లు వచ్చాయి. మిగిలిన 19 మంది అభ్యర్థులకు 12,030 ఓట్లు వచ్చాయి. నోటాకు 552 ఓట్లు పడ్డాయి.



దుబ్బాక ఉప ఎన్నికలో మొత్తం 1,64,186 ఓట్లు పోలవ్వగా బీజేపీకి 62,772, టీఆర్ఎస్ కు 61,302, కాంగ్రెస్ కు 21,819 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థి బంగారు నాగరాజుకు 3,489 ఓట్లు వచ్చాయి. ఈ మూడు పార్టీల తర్వాత నాగరాజు నాలుగో స్థానంలో నిలిచాడు. కారును పోలిన గుర్తును నాగరాజుకు కేటాయించడంతోనే టీఆర్ఎస్ కు రావాల్సిన ఓట్లన్ని అతనికి పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1453 పోలవ్వగా అందులో 1381 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్లలో టీఆర్ఎస్ కు 720, బీజేపీకి 368, కాంగ్రెస్ కు 142 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి బంగారు నాగరాజుకు 60 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
https://10tv.in/frustrated-russian-youtuber-sets-rs-2-4-crore-mercedes-car-on-fire-as-it-kept-malfunctioning/
దుబ్బాక ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. దీంతో దుబ్బాక ఓటర్లు కన్ఫ్యూజ్ అయి కారును పోలిన గుర్తుకు ఓటేయడంతో కొంత నష్టం కలిగి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీఆర్ఎస్ ఓటమికి కారును పోలిన గుర్తు కారణమైందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.